రాష్ట్రీయం

దివ్యక్షేత్రంగా ఒంటిమిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మే 25: కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రం మాస్టర్‌ప్లాన్ అద్భుతంగా ఉందని టీటీటీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర భద్రాచలంగా ఒంటిమిట్టను ప్రభుత్వం గుర్తించి, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తోందన్నారు. ఒంటిమిట్టను అత్యద్భుత దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించిన భక్తుల సముదాయాన్ని టీటీటీ చైర్మన్ సుధాకర్‌యాదవ్, టీటీడీ జేఈఓ భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అమరావతి డిజైనర్లు తయారుచేసిన ఒంటిమిట్ట మాస్టర్‌ప్లాన్‌ను జిల్లా అధికారులు, టీటీడీ యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ఆశయానికి అనుగుణంగా ఒంటిమిట్ట మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుందన్నారు. ఈ ఘనత అమరావతి డిజైనర్లకు దక్కుతుందన్నారు. ఇందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే వాటిని పరిశీలించి ఆగస్టు చివరినాటికల్లా తుదిరూపు ఇస్తారన్నారు. సెప్టెంబర్‌లో కల్యాణవేదిక, ఆలయ ప్రాంగణంలో పనులు చేపడతామన్నారు. ఇప్పటి వరకు ఒంటిమిట్టలో రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు టీటీడీ జేఈఓ భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం కల్యాణవేదిక ప్రాంగణంలో రూ. 40 కోట్లతో శాశ్విత కట్టడాలు, ఆలయ ప్రాంగణంలో సుమారు రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఇందులో వెయిటింగ్ హాల్, విశ్రాంతి గది, పురావస్తుశాఖ, టీటీడీ కార్యాలయాలు, మరుగుదొడ్లు, మినీ గెస్ట్ హౌస్‌లు, శ్రీరామ ప్రాజెక్టు రూపకల్ఫన, పోతన మెమోరియల్ హాల్, జాంబవంతుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు.
రామాయణంలో ఏడు ఘట్టాలు ఉన్నాయని, ఒక్కో ఘట్టానికి చెందిన విశేషాలు భక్తులకు అర్థమయ్యేరీతిలో శిల్పాల రూపంలో ఏర్పాటు చేస్తామన్నారు. పురావస్తుశాఖ అనుమతి పొందిన ఈ పనులను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామన్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం రోజు ఏప్రిల్ 30న జరిగిన గాలివాన సంఘటనను దృష్టిలో ఉంచుకుని సీఎం ఆదేశాల మేరకు మాస్టర్‌ప్లాన్‌ను యుద్ధప్రాతిపదికన రూపొందిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఒంటిమిట్టను అద్భుతమైన దివ్యక్షేత్రంగా, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అంతకుముందు టీటీటీ చైర్మన్ పుట్టా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.