రాష్ట్రీయం

మా గీత మార్చండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 26 : పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలను సమర్పిస్తూ తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. శనివారం నాటి పాదయాత్రలో భాగంగా కల్లుగీత కార్మికులు జగన్‌ను కలసి తమ సమస్యలను చెప్పుకున్నారు. గౌడ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పాదయాత్ర 172వ రోజుకు చేరుకుంది. శనివారం ఉండి నియోజకవర్గంలోని అజ్జమూరు శివారు నుంచి ప్రారంభమై కుప్పనపూడి, కొలనాపల్లి, కాళ్ల, సీసలి క్రాస్ మీదుగా జక్కరం వరకు సాగింది. రోజంతా ఆకివీడు, కాళ్ల మండలాల్లో పర్యటించిన జగన్‌కు ప్రతీ చోటా స్థానిక ప్రజలు ఘనస్వాగతాలు పలికారు. శుక్రవారం సాయంత్రానికి 2146.2 కిలోమీటర్లు నడిచిన జగన్ శనివారం మరో 12.5 కిలోమీటర్లు నడిచి ఇంత వరకు 2158.7 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. పాదయాత్రలో భాగంగా కోలనాపల్లి చేరుకున్న జగన్‌ను అర్చక ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. జిల్లాలో దాదాపు 3700 మంది అర్చకులు పనిచేస్తున్నారని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా గతంలో వైఎస్‌ఆర్ జీవో 65ఏను తీసుకువచ్చారని, అయితే అది ఇప్పుడు అమలుకావడం లేదని చెప్పారు. జీవో అమలయ్యేలా చూసి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జగన్‌ను కల్లుగీత కార్మికులు కలుసుకుని గౌడ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి విరివిగా రుణాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కాళ్ల గ్రామంలో
ఆయనను మహిళలు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. గ్రామంలో రహదారులు, డ్రెయినేజీలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు స్కాలర్‌షిప్‌లు అందక నానా ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు వివరించారు. సమస్యలు విన్న జగన్ అందరికీ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. కాగా కాళ్ల గ్రామంలో జగన్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు న్యాయవాదులు వైకాపాలో చేరారు. వారందరికీ కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా శనివారం నాటి పాదయాత్రలో ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ మండే ఎండలను సైతం నిర్విరామంగా నడుస్తున్న జగన్ సంకల్పం, ఆశయానికి ఆకర్షితుడినై యాత్రలో పాల్గొన్నట్లు పోసాని తెలిపారు. మండుతున్న ఎండల్లో తాను కనీసం మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయానని, అలాంటిది జగన్ ఏకంగా రెండు వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారని అభినందించారు. ఇది జగన్ ధృఢసంకల్పం, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమలుకు సాధ్యంకాని హామీలను ఇవ్వబోనన్న జగన్ చిత్తశుద్ధి తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని, అందుకే తాను ఆ మాట ఇవ్వడం లేదని జగన్ చెప్పారన్న పోసాని ఇంత నిజాయితీ ఉన్న నేతకు సీఎం అయ్యేందుకు అన్ని విధాలా అర్హత ఉందన్నారు. అందుకే తాను యాత్రలో పాల్గొన్నానని చెప్పారు. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించగలిగే నేత వైఎస్ జగన్ అని పోసాని పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో జగన్‌కు ప్రతీ చోటా ఘనస్వాగతం లభించగా సీసలి క్రాస్ వద్ద జగన్‌ను కలిసిన వలస కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. బతుకుతెరువు కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన తాము ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నామని, అయినా తగిన విధంగా ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో వున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ తాము అధికారంలోకి వస్తే అమలుచేసే నవరత్న హామీలను వారికి వివరించారు.