రాష్ట్రీయం

నేనే దళపతిని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 26: రాజకీయ గుర్తింపు ఒకరిస్తే తీసుకునే వ్యక్తిని తాను కాదని, జనసైన్యాన్ని నడిపే దళపతిని అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజలంతా తెలుగువారేనని, టీడీపీ ప్రజలే ప్రభుత్వానికి అతిముఖ్యులని విమర్శించారు. ముఖ్యమంత్రి రాజకీయ గుర్తింపు కోసం దీక్ష చేస్తున్నట్టు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల బాగుకోసం 24 గంటలపాటు నిరాహారదీక్ష నిర్వహించిన పవన్‌కళ్యాణ్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు కిడ్నీ రోగంతో బాధపడుతున్న రాపాక సిద్ధార్థ చేతులమీదుగా నిమ్మరసం తీసుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పవన్‌కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ప్రసంగించారు. తన నిరసన రాజకీయ గుర్తింపుకోసం కాదని, అటువంటి పరిస్థితులే ఉంటే 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చి గెలిపిస్తానంటూ ప్రశ్నించారు. దశాబ్దంన్నర కాలంగా ఉద్దానంలో 20 వేల మంది కిడ్నీ రోగాలతో మృతి చెందిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళానని, కిడ్నీ రోగులను కాపాడలేని ప్రభుత్వంపై పోరాటం
చేయడం తప్పా? అంటూ నిలదీసారు. అసలు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నామన్నది తెలుసుకోవల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందన్నారు. గతసారి ఉద్దానం పర్యటనలో చాలీచాలని ఆదాయంతో సామాన్య కుటుంబాల దుస్థితి సీఎం దృష్టికి తీసుకెళ్ళానన్నారు. ఒక తల్లి తన కుటుంబాన్ని చాలీచాలని ఆదాయం ఉన్నప్పుడు పండగలు, పబ్బాలను చేసుకోలేక, కిడ్నీరోగాలతో ప్రాణాలే వదిలేసుకునే ఉద్దానం కోసం ఏడాది కాలంగా ఏమీ చేయని ప్రభుత్వంపై ప్రజాపోరాటం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. విభజన తర్వాత, ఆర్థిక పరిస్థితి బాగులేదంటూనే 2000 కోట్లు పుష్కరాలకు ఖర్చు చేయడమెందకన్నారు. ఆ సొమ్మును ఉద్దానం ప్రాంతంలో సమస్యకు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. దగాచేసిన కేంద్రప్రభుత్వానికి, దానికి మద్దతు పలికిన టీడీపీ కోసమే ఈ నిరసన అన్నారు. విదేశాలకు వెళ్ళడానికి, స్టార్ హోటళ్ళల్లో బస చేయడానికి అయ్యే ఖర్చులైతే తానుగా అర్థం చేసుకుంటానని, సగటు ఉత్తరాంధ్ర వలస జీవులు, ఉపాధి లేని శ్రీకాకుళం జిల్లా వాసులు, ఉద్యోగాలు లేని యువత మాత్రం బాబు దుబార ఖర్చులపట్ల నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతారంటూ పవన్ హెచ్చరించారు. అన్యాయం అనంతమై, ఉద్యమానికి నాంది పలికితే జనసేన సామాజిక, రాజకీయ చైతన్యం కోసం పోరాటం చేస్తోందని బాబు సర్కార్‌కు అల్టిమేటం ఇచ్చారు. వేల కోట్లు ఆర్జించిన బాబు, ఆయనకు తెలిసిన కార్పొరేట్ దిగ్గజాలు సీఎస్‌ఆర్ విధానంలో ఉద్దానం సమస్యపై నెఫ్రాలజిస్టును తీసుకురావడం, ప్రతీ మండలానికి ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎందుకు ముందుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. అభివృద్ధికి నోచుకోనివారు, అభివృద్ధిని తమ గుప్పిట్లో పెట్టుకున్నవారి మధ్య అసమానతలు తొలగించాలన్నదే జనసేనపార్టీ మానిఫెస్టో అంటూ పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇచ్చినట్టయితే ఇటువంటి అసమానతల నుంచి బయటపడి, సామాన్య ప్రజలు అభివృద్ధివైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందన్నారు. అందుకే - ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వాలన్న నినాదంతోనే జనసేన పోరాటయాత్ర చేస్తుందన్నారు. ఈ దీక్షకు సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ సంఘీభావం తెలిపారు.