రాష్ట్రీయం

సైకిల్ విజయ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: మూడురోజుల పాటు ఆదివారం నుంచి జరిగే టీడీపీ పసుపు పండుగకు విజయవాడ ముస్తాబయింది. ఆదివారం నుంచి విజయవాడ కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగే మహానాడు సర్వం సిద్ధం చేశారు. మరో ఏడాదిలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు మహానాడుకు సిద్ధమవుతున్నాయి. పార్టీ సదస్సును విజయవంతం చేయడం ద్వారా ప్రజలకు సరైన సంకేతాలందించాలన్న లక్ష్యంతో అధినేత చంద్రబాబు, పార్టీ గణాలు మహానాడుపై ప్రత్యేక దృష్టి సారించాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలతో విజయవాడ నగరం పసుపు తోరణాలు కట్టుకుంది. దివంగత ఎన్టీఆర్ హయాంలో తొలిసారిగా 1983లో కృష్ణానదీ తీరాన జరిగిన మహానాడుకు దేశంలోని వివిధ రాష్ట్రాల, వివిధ రాజకీయ పక్షాల నేతలు భారీ సంఖ్యలో తరలిరాగా నేడు దీనికి పూర్తి భిన్నంగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల, ఇతర పక్షాల నేతలకు ఆహ్వానాలు లేనప్పటికీ ఈ దఫా కేవలం వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణుల్లో ద్విగుణీకృతోత్సాహాన్ని నింపే విధంగానే చర్చలు, ప్రసంగాలు, తీర్మానాలు జరుగబోతున్నాయి. గత ఏడాది విశాఖలో జరిగిన మహానాడు కంటే మరింత విజయవంతమయ్యేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడుకు వెళ్లే ప్రతి రోడ్డును పసుపుమయం చేస్తున్నారు. పార్టీ జెండాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. సీఎం చంద్రబాబుతో సహా పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ మూడురోజులు నగరంలోనే ఉండనున్నారు. ప్రధానంగా చంద్రబాబు ఉదయమంతా ప్రాంగణంలోనే ఉండనున్నారు. ఇందుకోసం వేదిక సమీపంలోనే ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఇక రాత్రికి ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయానే్న సభా ప్రాంగణం వద్దకు చేరుకుని అక్కడే ఉంటారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా శనివారం రాత్రి నుంచే నగరంలో వాహనాల మళ్లింపును చేపట్టారు. నగరంలోకి వచ్చే భారీ వాహనాలను వెలుపల నుంచే దారి మళ్లిస్తున్నారు. కేవలం మహానాడుకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇదిలా ఉండగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం డ్రమ్ములు మోగింపచేసి మహానాడు సంబరాన్ని ప్రారంభించారు. అనంతరం దేవినేని అవినాష్, ఇతర నాయకుల నేతృత్వంలో సాగిన కవాతులో మంత్రి ఉమా మాట్లాడుతూ టీడీపీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే ప్రాణమన్నారు. అమరావతిలో తొలిసారిగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడులో పాల్గొనడానికి వస్తున్న కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కార్యకర్తల సంక్షేమం చూసుకునే పార్టీ ఒక్క తెలుగుదేశమేనని అన్నారు.
ఈ మహానాడుకు 30వేల మంది ప్రతినిధులు, వచ్చి వెళ్లే సందర్శకులతో పాటు లక్షా 30వేల మంది హాజరు కాగలరన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష చదరపు అడుగుల ప్రాంగణాన్ని అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన వేదికలు, గ్యాలరీలు, ఏసీల బిగింపు, సౌండ్ సిస్టం, లైటింగ్, భారీ హోర్డింగ్‌లు వంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రత్యేక ఆహ్వానితులు, ఆహ్వానితులు కలిపి మొత్తం 30వేల మందికి సరిపడా ఒక వీఐపీ బ్లాక్, ఒక స్పెషల్ ఇన్వైటీ బ్లాక్, ఆల్ ఇన్వైటీస్ బ్లాక్‌లు ఇలా మొత్తం ఎనిమిది గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 16 కమిటీలు గత వారం రోజులుగా చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. విశాఖలో వేదికల ఏర్పాట్లు చేపట్టిన ఆర్‌కేస్ ఈవెంట్స్ సంస్థే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా ఎండ, వర్షం ప్రభావం లేకుండా ఏర్పాట్లు చేశారు. రుచికరమైన భోజనం అందించేందుకు అంబికా క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తగు ఏర్పాట్లు చేస్తున్నది. 1280/400 అడుగులతో భారీ వేదిక, దాని పక్కన 140/200 అడుగుల విస్తీర్ణంలో రెండో వేదిక ఏర్పాటైంది. ముందు భాగంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటుచేశారు. ఈ మూడు వేదికలకు సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయానికి 1800 టన్నుల సామర్థ్యం కల్గిన జనరేటర్లతో పాటు అదనంగా 250 కూలర్లను సిద్ధం చేశారు. ప్రాంగణం మొత్తంపై మూడువేల అత్యంత శక్తివంతమైన ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గాను 15వేల కిలోవాట్ల సామర్థ్యం కల్గిన 10 జనరేటర్లను సిద్ధం చేశారు. సమీపంలోని కార్పొరేట్ కళాశాలలు, కల్యాణ మండపాల్లో ప్రతినిధులకు బస ఏర్పాటు చేశారు. వీరంతా ప్రాంగణానికి వచ్చిపోయేలా ప్రత్యేకంగా స్కూల్ బస్సులు సిద్ధమయ్యాయి. సాయంత్రం అలాగే పగలు ఉపన్యాసాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 40 ఎకరాల్లో వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహానాడులో మూడురోజులపాటు కీలక సేవలందించేందుకు 800 మంది వాలంటీర్లు సన్నద్ధంగా ఉన్నారు. వీటి బాధ్యతను దేవినేని అవినాష్‌కు అప్పగించారు. అన్నింటి మించి ఈదఫా వీఐపీ, వీవీఐపీ పాసుల్లేవు. సభ్యత్వ నమోదు కార్డే మహానాడు ప్రవేశానికి ఈ సారి ఎంట్రీపాస్.