రాష్ట్రీయం

బాలికలే టాపర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలను బోర్డు శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షల్లో 11 లక్షల మంది హాజరవ్వగా, 83.01 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఈ ఉత్తీర్ణతా శాతం 82.02 శాతం ఉంది. ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 88.31 శాతం ఉండగా, బాలుర శాతం 78.99 శాతం ఉందని సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులు వెల్లడించారు. సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాల్లో నోయిడాకు చెందిన మేఘన ప్రథమలురాలిగా నిలిచింది. స్టెప్ బై స్టెప్ స్కూల్‌లో చదివిన ఈమె 500కు 499 మార్కులు సాధింది. ఒక్క ఇంగ్లీష్‌లో 99 మార్కులు తప్ప రాసిని అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతం మార్కులు పొందింది. ఘజియాబాద్‌కు చెందిన విద్యార్థిని అనుష్క 498 మార్కులు పొంది ద్వితీయస్థానంలో నిలువగా, 497 మార్కులతో ఏడుగురు విద్యార్థులు తృతీయస్థానాన్ని పొందారు. కేరళలోని త్రివేండ్రంలో అత్యధిక ఉత్తీర్ణతా శాతం 97.32 శాతం నమోదైంది. చెన్నై రీజియన్ 93.87 శాతంతో రెండో స్థానం, 89 శాతంతో ఢిల్లీ మూడోస్థానంలో నిలిచాయి. దివ్యాంగుల కేటగిరిలో కేరళకు చెందిన విజయ్‌గణేష్ 98.4 శాతంతో ప్రథమంగా నిలిచాడు. ఇలావుండగా సిబిఎస్‌ఇ నిర్వహించిన 12వ తరగతి పరీక్షలపై పలు వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల పరీక్ష పేపర్లు లీకయ్యాయన్న ఆరోపణలు అధికంగా వచ్చాయి. కాగా ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఎకనామిక్స్ పరీక్షను బోర్డు ఏప్రిల్ 25న మళ్లీ నిర్వహించింది.