రాష్ట్రీయం

అక్రమ బదిలీలు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: కౌనె్సలింగ్‌కు ముందే ప్రభుత్వ ఉత్తర్వులతో నేరుగా అక్రమ బదిలీలు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇప్పటికే సిద్ధం చేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని, కొత్తగా ఎవరికీ అడ్డదారిలో బదిలీలు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. జాక్టో, యుఎస్‌పిసి ఆధ్వర్యంలో డిఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అవినీతికి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా బదిలీలు చేసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించిన నాలుగు రోజులకే కౌనె్సలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ తమ కార్యాలయం నుండే వందల సంఖ్యలో అడ్డదారిలో బదిలీలు చేయడం అంటే సంపన్న వర్గాలను, పైరవీ కారులను ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకడమేనని ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 20 శాతానికి మించి నాన్‌లోకల్స్ పెరిగిపోయారని, ఈ రెండు జిల్లాలకు బదిలీలపై నిషేధం ఉన్నా అన్నింటినీ తుంగలో తొక్కి స్థానిక జిల్లాల ఉద్యోగ, నిరుద్యోగులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం అక్రమ బదిలీలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం మాటలకు, చేతలకు ఎలాంటి పొంతన లేదని ఈ ఘటనతో అర్ధం అవుతోందని, జాక్టో నేతలు నర్సింహారెడ్డి, సంజీవరావు, శారద, రవీందర్ రాంబాబు, వినోద్‌కుమార్, మల్లయ్య, ఎం డి ఫయాజ్, మహ్మద్ యూసుఫ్ తదితరులు పేర్కొన్నారు.