రాష్ట్రీయం

ఎరువుల అక్రమాలపైఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: గత కొన్ని రోజులుగా విత్తన కంపెనీలపై విరుచుకుపడిన తూనికలు కొలతల శాఖ ఇప్పుడు ఎరువులు, పురుగు మందుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపార సంస్థలపై ఉక్కుపాదం మోపింది. తెలంగాణవ్యాప్తంగా 89 కేసులు నమోదు చేసి రూ.6.65 కోట్ల ఎరువులను సీజ్ చేశారు. ఎరువులు, పురుగుల మందుల విక్రయాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్నదాతలకు సరైన తూకంతో ఎరువులు, విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎరువుల దుకాణాలు, గోదాముల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తూనికలు, కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల బస్తాల తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులు ఉండటం గమనించి కేసులు నమోదు చేశారు. విత్తన కంపెనీలపై దాడి చేసి 154 కేసులు నమోదు చేశామని, తూకం పేరుతో రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.