రాష్ట్రీయం

ఎన్టీఆర్ ఆశయమే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 28: ‘లక్షల్లో.. కోట్లలో ఎందరో పుడుతుంటారు.. మరెందరో చనిపోతుంటారు.. వారిలో కొందరు మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు.. వారిలో చరిత్ర సృష్టించే యుగపురుషుల్లో దివంగత ఎన్టీఆర్ ఒక్కరంటూ’ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. మహానాడులో రెండోరోజైన సోమవారం ఉదయం తొలుత దివంగత ఎన్టీఆర్ 95వ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా తరచుగా అనేక పర్వదినాలు వస్తూంటాయని, కానీ, వీటికన్నింటికీ అతీతంగా జరిగేది ఎన్టీఆర్ జయంతి ఒక్కటేనని అన్నారు. అయినప్పటికీ కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదో అర్థం కావటం లేదంటూనే.. ఒక్కసారిగా ఉద్వేగంతో ఎందుకు ప్రకటించదో చూస్తాం.. లేకపోతే కేంద్రం అంతు చూడటానికి కూడా టీడీపీ వెనుకాడబోదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా అప్పటికప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ తనంతట తానే తీర్మానం ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదింప చేసుకున్నారు. ఎన్టీఆర్‌ను భావితరాలు మరవకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకై నాడు ఎన్టీఆర్ తలపెట్టిన తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి తదితర సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే వరకూ తాను నిద్దురపోనంటూ శపథం చేశారు. ఎన్టీఆర్ అతి సాధారణ కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు సాయంగా విజయవాడలో హోటళ్లకు పాలుపోస్తూ పైకి వచ్చిన స్ఫూర్తి ప్రదాత.. ఆదర్శప్రాయుడంటూ బాబు కొనియాడారు. దీనికంతటికీ కారణం ఆయనఉన్న అసాధారణ ప్రతిభే అన్నారు. మారుమూల పల్లె నిమ్మకూరులో జన్మించి ఐదో తరగతి వరకు చదివి విజయవాడ మున్సిపల్ స్కూలులో ప్రాథమిక విద్య, ఆపై ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఇంటర్, గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి ఓ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల వారికి కూడా ఆదర్శప్రాయుడని అన్నారు. ఇక సినీ రంగంలో ఆయన ధరించని పాత్రంటూ లేదన్నారు. 1980 ప్రాంతంలో తాను సినీమాటోగ్రఫీ మంత్రిగా తొలిసారిగా అనురాగదేవత సినీ షూటింగ్‌లో ఆయనను కలిసినప్పుడు 33 ఏళ్లలో తాను నటించిన 292 సినిమాలను ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదో చేయాలని ఉందని, వారందరికీ సేవలందించాలని చెబుతూనే తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని అన్నారు. టీడీపీని స్థాపించిన కేవలం తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్‌ను మట్టి కరిపించి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రావనిలో ఇక ఏ ఒక్కరూ రాగి, సజ్జ అన్నంతో పరిమితం కారాదనే ఆలోచనతో, అన్నమో రామచంద్రా.. అనే రోదన లేకుండా దేశంలోనే తొలిసారి రెండు రూపాయలకు కిలోబియ్యం.. ఆపై పూరిళ్ల స్థానంలో పక్కా ఇళ్లు, రైతులకు 50 రూపాయలకే
విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు. ప్రజలను పీడించే పట్వారీ, పటేల్ వ్యవస్థను కలం పోటుతో రద్దుచేసి మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడమేగాక పరిపాలనలో అనేకానేక సంస్కరణలు తీసుకొచ్చారు. మహిళల్లో చైతన్యం కోసం తొలిసారిగా మహిళా వర్సిటీ, వారికి ఆస్తిలో సమాన హక్కు.. అన్నింటా రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహనీయుడు అంటూ కొనియాడారు. పైగా సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లంటూ తొలిసారిగా నినాదం ఇస్తూ పేదరికం లేని సమాజం కోసం.. అలాగే ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడిన వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కరేనని అన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీరు సమస్య ఉండరాదనే భావనతో తొలిసారిగా తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ను నిత్యం గుర్తుంచుకోవాలన్నారు. ఆ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే వరకు తాను నిద్దుర పోనంటూ బాబు శపథం చేశారు. ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తామన్నారు. అలాంటి మహనీయుని జ్ఞాపకార్థం రాజధాని అమరావతి నగరంలో ఎన్టీఆర్ భారీ విగ్రహంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

చిత్రం..విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు