రాష్ట్రీయం

ఆక్వా పార్కు తరలింపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 28: తమ పార్టీ అధికారంలోకి వస్తే తుందుర్రు ఆక్వా పార్కును సముద్ర తీరప్రాంతానికి తరలిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది. సోమవారం నాటి పాదయాత్ర భీమవరం సమీపంలోని విస్సాకోడేరు శివారు నుంచి ప్రారంభించి విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు మీదుగా వీరవాసరం వరకు సాగింది. ఈసందర్భంగా ప్రతిచోటా ఆయన ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. తొలుత జగన్‌ను తుందుర్రు మెగా ఆక్వా పార్కు బాధితులు కలుసుకున్నారు. ఈసందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తీవ్ర కాలుష్యం వెదజల్లే ఆక్వా పార్కు వద్దని తాము ఆందోళనకు దిగితే తమను
ఏ స్థాయిలో ప్రభుత్వం వేధించిందన్నది వారు ఫోటోల ద్వారా వివరించారు. అక్రమ కేసులు బనాయించటంతోపాటు జైళ్లలో కూడా పెట్టారని వాపోయారు. చివరకు ఆడవాళ్లని కూడా చూడకుండా మగపోలీసులు తమపై ఏలా దౌర్జన్యం చేశారన్నది వారు జగన్‌కు వివరించారు. ఈసందర్భంగా ఆయన వారికి భరోసా ఇస్తూ తప్పనిసరిగా ఆక్వా పార్కును అక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో జగన్‌ను కలిసిన ఆక్వా రైతులు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వస్తే రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తామన్న జగన్ ప్రకటనపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా రంగంపై జగన్ నిర్ణయాలు తమకెంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు. పాదయాత్ర గొరగనమూడి చేరుకోగానే అక్కడి ఎస్సీ కాలనీవాసులు జగన్‌ను కలుసుకుని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఇళ్లు కట్టించారని, ఆతర్వాత తమను పట్టించుకున్నవారు లేరని మొరపెట్టుకున్నారు. పెన్నాడ చేరుకున్న జగన్‌ను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిశారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్న చంద్రబాబు చివరకు బ్రాహ్మణ సంఘాలను కూడా వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు వైఖరి వల్ల బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతోందని, దీనిని నివారించేలా చూడాలని కోరారు. కాగా శృంగవృక్షం చేరుకున్న జగన్‌ను అక్కడ పలువురు మత్స్యకారులతోపాటు పార్టీ అనుబంధ మత్స్యకార సంఘ ప్రతినిధులు కలుసుకున్నారు. చేపల వేట విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు నెలకు పదివేల రూపాయలు ఆర్దిక సహాయం చేస్తామన్న జగన్ ప్రకటనపై వారు హర్షం వ్యక్తంచేశారు. మత్స్యకారులకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆర్థిక చేయూతనివ్వాలని కోరారు. నందమూరుగర్వు మీదుగా వీరవాసరం వరకు పాదయాత్ర జననీరాజనాల మధ్య సాగింది. ఈసందర్భంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈపధకం రద్దు అయ్యేలా చూడాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్లకార్డులను కూడా వారు ప్రదర్శించారు.

చిత్రం..ఉపాధ్యాయులతో సెల్ఫీ దిగుతున్న జగన్