రాష్ట్రీయం

ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నాడు మొదలైంది. తొలి రోజు 10వేల మందిని ఆహ్వానించగా, 5699 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. 100లోపు ర్యాంకర్లు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. 101 నుండి 500 ర్యాంకు వరకూ 63 మంది, 501 నుండి 1000 ర్యాంకర్లు 193 మంది, 1001 నుండి 2000 ర్యాంకు వరకూ 529 మంది, 2001 నుండి 5000 ర్యాంకు వరకూ 1784 మంది, 5001 నుండి 10వేల ర్యాంకు వరకూ 3127 మంది హాజరయ్యారు. 40వేల ర్యాంకు వరకూ ఎన్‌సిసి వారినీ ఆహ్వానించగా, వారితో పాటు 6075 మంది హాజరయ్యారు. 29వ తేదీన 10001 నుండి 25వేల ర్యాంకు వరకూ అభ్యర్ధులను ఆహ్వానించారు. స్పెషల్ క్యాటగిరి అభ్యర్ధులను మాసాబ్‌ట్యాంకులో సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను జూన్ 5వ తేదీ వరకూ జరగనుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో కన్వీనర్ కోటా కింద 64,566 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 17,046, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 15662 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్‌లో 8198 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 9885 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 8373, ఐటిలో 3369 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి.
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో 252, అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో 27, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో 84, బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో 51, బయోటెక్నాలజీలో 21, కెమికల్ ఇంజనీరింగ్ 246, సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో 60, డయిరీలో 20, డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్‌లో 60, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 168, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 322, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్‌లో 42, ఫెసిలిటీస్ అండ్ సర్వీసు ప్లానింగ్ 60, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ 20, ఫుడ్ సైన్స్ 43, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 112, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 60, మెకానికల్ (మెకట్రానిక్స్) ఇంజనీరింగ్ 42, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 60, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 42, మైనింగ్ ఇంజనీరింగ్ 97, పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 42, ఫార్మాస్యుటికల్ ఇంజనీరింగ్ 42, ప్లానింగ్ 40, టెక్స్‌టైల్ టెక్నాలజీ 20 కలిపి 64,566 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా మరో 31 వేల సీట్లు మైనార్టీ కాలేజీల్లోనూ, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలో అందుబాటులో ఉన్నాయి. మరికొన్నింటికి యూనివర్శిటీల అనుమతి రావల్సి ఉంది.