రాష్ట్రీయం

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షునిగా దేవులపల్లి అమర్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షునిగా సీనియర్ ప్రాతికేయుడు దేవులపల్లి అమర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన తెలంగాణలోని వరంగల్ జిల్లా వాస్తవ్యులు. ఐజెయు అధ్యక్షునిగా దేవులపల్లి అమర్, ప్రధాన కార్యదర్శిగా సబీనా ఇంద్రజిత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఐజెయు ఎన్నికల కేంద్ర రిటర్నింగ్ అధికారి ప్రేమ్‌నాధ్ భార్గవ ప్రకటించినట్టు ఐజెయు కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఐజెయు సెక్రటరీ జనరల్‌గా దేవులపల్లి అమర్, అధ్యక్షునిగా ఎస్‌ఎన్ సిన్హా కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం ముగియడంతో తాజాగా ఎన్నికలు నిర్వహించగా దేవులపల్లి అమర్, సబీనా ఇంద్రజిత్ ఏకగ్రీవంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైనట్టు నరేందర్‌రెడ్డి తెలిపారు. ఐజెయు అధ్యక్షునిగా ఎన్నికైన దేవులపల్లి అమర్‌కు జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ నాయకులు కె శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమర్‌నాధ్ శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు, జర్నలిస్ట్స్ సంక్షేమం కోసం అమర్ నాయకత్వంలో ఐజెయు మరింత కృషి చేయాలని వారు తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.

చిత్రం..దేవులపల్లి అమర్