రాష్ట్రీయం

మహాప్రస్థానంలో మాదాల అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: అభ్యుదయ సిని నిర్మాత, నటుడు మాదాల రంగారావు అంత్యక్రియలు సోమవారం ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. 1980-90 దశకంలో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఎన్నో విప్లవ చిత్రాలను నిర్మించిన మాదాల ఆదివారం ఉదయం మృతిచెందిన విషయం విదితమే. మాదాల మృతదేహాన్ని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో సందర్శనార్ధం ఉంచారు. సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేనితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన మృతదేహాన్ని సందర్శించుకొని పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళ్ళర్పించారు. మాదాల తీసిన సినిమాలు సమాజాన్ని, యువతను ఎంతో చైతన్య పరిచాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాదాలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.