రాష్ట్రీయం

మోసగించిన ట్రావెల్ ఏజెన్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన 10 మంది యాత్రికులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. మానస సరోవరం వెళ్లేందుకు ఖమ్మం నగరంలోని అయ్యప్ప దేవాలయం కార్యదర్శి అప్పారావు ఆధ్వర్యంలో 10 మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన స్టార్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు. అందరినీ నేపాల్ రాజధాని ఖాట్మండ్‌కు తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ యాజమాన్యం అక్కడి నుంచి మానస సరోవరం పంపిస్తామని చెప్పింది. కానీ రెండు రోజులు గడిచినప్పటికీ వారిని అక్కడి నుంచి తీసుకెళ్లకపోగా ఏజెన్సీ నిర్వాహకులు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన యాత్రికులు స్థానికుల సహాయంతో ట్రావెల్ ఏజెన్సీ గురించి వాకబు చేసినా సరైన సమాచారం లభించలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు ఖమ్మంలోని మీడియాను ఆశ్రయించారు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి వారిని సురక్షితంగా ఖమ్మం తరలిస్తామని చెప్పారు. ఈసందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఖమ్మం నగరానికి చెందిన పర్యాటకులు ఖాట్మండ్‌లో చిక్కుకుపోవడం దురదృష్టకరమని, వారిని సురక్షితంగా ఖమ్మం తీసుకొస్తామని చెప్పారు. ఈమేరకు విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఢిల్లీలోని తెలంగాణ అధికారులతోనూ మాట్లాడి యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పొంగులేటి వివరించారు.