రాష్ట్రీయం

31న ఎడ్‌సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో బి.ఇడి కోర్సుల కోసం 31న ఎడ్‌సెట్-2018 నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. పరీక్షకు 38,693 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈసారి ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. 31న ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, తెలంగాణలో 53, ఆంధ్రలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాద్యమాల్లో నిర్వహిస్తామని, అభ్యర్ధులు ఉదయం 9 గంటలకంటే ముందే చేరుకోవాలని, సాయంత్రం సెషన్ పరీక్ష రాసేవారు కూడా గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు.
1న డీసెట్ పరీక్ష
జూన్ 1న డీసెట్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 2.30 గంటల వరకూ మరో సెషన్ ఉంటుందని, ఈసారి ఆన్‌లైన్ మోడ్‌లోనే పరీక్ష నిర్వహిస్తున్నామని వారు చెప్పారు.