రాష్ట్రీయం

మా జోలికొస్తే.. ఖబడ్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 29: కట్టుబట్టలతో..నయాపైసా ఆదాయం లేకుండా రాజధాని ఎక్కడో తెలియకుండా రాష్ట్రాన్ని విభజించినప్పటికీ మా కున్న వనరులు.. ప్రజా సహకారంతో ప్రపంచ దేశాల్లోనే ఐదో స్థానంలో నిలిచే రాజధాని అమరావతి నగర నిర్మాణం జరుపుకుంటుంటే ముందుగా ప్రకటించిన ఆర్థిక సాయం అందించకపోగా ప్రజలను రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. మహానాడులో మూడోరోజైన మంగళవారం ‘ప్రజా రాజధాని.. మన అమరావతి.. అద్భుత ఆవాస యోగ్యం.. ఆనంద నగరం..’ తీర్మానంపై దాదాపు గంటసేపు చర్చ అనంతరం చివరగా ఆ తీర్మానాన్ని హర్షధ్వానాల మధ్య ఆమోదింప చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.. అయితే అత్యంత సుందర రాజధాని నగర నిర్మాణం కోసం తొలి విడతగా 45వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిజైన్లు సిద్ధం చేసి రూ.22వేల కోట్ల పనులకు టెండర్లు కూడా పిలిచామన్నారు. అయితే కేంద్రం నుంచి వచ్చిన మొత్తం ఇప్పటివరకు రూ.1500 కోట్లు కాగా రూ.2100 కోట్లు అందచేసినట్లుగా అమిత్‌షా పచ్చి అబద్దాలు ఆడుతున్నారంటూ బాబు నిప్పులు చెరిగారు. రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయితే కేంద్రానికి ప్రతిఏటా ఐటీ, జీఎస్టీ, ఇతరత్రా పన్నుల రూపేణా కోట్లాది రూపాయల రాబడి వస్తుందనేది మరువరాదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించని పక్షంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి పన్నులు కూడా చెల్లించబోమంటూ ఉద్వేగంతో హెచ్చరించారు. మొక్కుబడిగా ఇచ్చిన ఆ కొద్ది మొత్తానికి కూడా వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు)
ఇవ్వలేదని ఒకసారి, డీపీఆర్‌లు ఇవ్వలేదని మరోసారి అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. అంతటితో ఆగక వీటి డిజైన్లు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయంటారు.. గతంలో సింగపూర్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలతో 15 రోజుల్లోనే అన్ని రకాల మాస్టర్ ప్లాన్‌లను తెప్పించడమే గాక కేంద్రం ఇచ్చిన రూ.1500 కోట్లకు 2017 జూలై 22 తేదీనే చేసిన ఖర్చులకు యూసీలు పంపించామన్నారు. అప్పట్లో తాము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ విశ్వసించకుండా తనిఖీ బృందాన్ని పంపించగా ఈ ఖర్చులన్నీ వాస్తవమేనంటూ గత ఫిబ్రవరి 21తేదీ నివేదిక పంపించిందన్నారు. మార్చి 27తేదీ రూ.1514 కోట్ల ఖర్చులతో, మే 22 తేదీ రూ.1632 కోట్ల ఖర్చులతో ఎప్పటికప్పుడు యూసీలు పంపించగా నీతి ఆయోగ్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ జరుగుతున్న పనులకు మరో రూ.800 కోట్ల నిధులు ఇవ్వాలని చూస్తే అమిత్‌షా మాత్రం యూసీలు, డీపీఆర్‌లు లేవనటం తెలుగువారి దౌర్భాగ్యమా అని బాబు ప్రశ్నించారు.
కొత్తగా రాజధాని నగర నిర్మాణానికి వందల ఎకరాలు చాలంటూ ప్రధానంగా ప్రతిపక్ష నేత జగన్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఆయా రాష్ట్రాల మొత్తం ఆదాయంలో 70 శాతం పైగా సమకూరుతుంటే ఈ రాష్ట్రానికి నయాపైసా ఆదాయం చేకూర్చే ఏ నగరమైనా ఉందాఅని బాబు ఆవేశంతో ప్రశ్నించారు. తన తెలివితేటలు.. ముఖ్యంగా ప్రజల్లో టీడీపీ పట్ల ప్రబలని విశ్వాసం వల్ల వేలాది మంది రైతులు నయాపైసా ఆశించకుండా రూ.50వేల కోట్ల విలువైన 33వేల ఎకరాల భూమిని రాజధాని నగరం కోసం అప్పగించారన్నారు. అయితే వౌలిక సదుపాయాలు, రైతులకు ప్లాట్లు కేటాయిస్తే మిగిలేది 8వేల ఎకరాలయితే అందులో కొన్ని ఎకరాలు విక్రయించి చేసిన అప్పులు తీరుద్దామనుకున్నామన్నారు. ఖబడ్దార్.. తమతో పెట్టుకోవద్దంటూ బాబు పదే పదే కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించారు.
జగన్‌పై ఆగ్రహావేశాలు
రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం నుంచి నేటికీ ఎలాంటి చేయూత లేక సొంత నిధులతో పనులు సాగిస్తూ తల్లడిల్లుతుంటే జగన్ మీడియా కనకదుర్గ గుడి వద్ద నిర్మాణంలోఉన్న ఫ్లైఓవర్ విషయంలో అవాకులు చెవాకులను ప్రసారం సాగిస్తున్నదంటూ బాబు తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు.

చిత్రం..అమరావతి నమూనా చూపిస్తూ మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు