రాష్ట్రీయం

నేనొస్తే.. బీమా ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 29 : ఏళ్ల తరబడి కొబ్బరి ఒలుపు పనిలోనే ఉండటంవల్ల తమ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడకపోగా అనారోగ్యం చుట్టుముడుతోందని, తమను కాపాడాలంటూ కొబ్బరి ఒలుపు కార్మికులు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అంతేకాకుండా బీమా వంటి సౌకర్యాలను కల్పిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మంగళవారం నాటికి 175వ రోజుకు చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి ప్రారంభమైన మంగళవారం నాటి పాదయాత్ర తలతాడితిప్పి, మెంతేపూడి క్రాస్, బొప్పనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్ మీదుగా కొప్పర్రు వరకు సాగింది. మత్స్యపురి తరువాత భీమవరం నియోజకవర్గం దాటిన జగన్ సీతారామపురం వద్ద నర్సాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. దారిపొడవునా జగన్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ప్రతీ చోటా ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పాదయాత్రకు స్థానిక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. తలతాడితిప్ప చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి భరోసాలు ఇస్తూ జగన్ ముందుకు సాగారు. మెంటేపూడి క్రాస్ చేరుకున్న జగన్‌ను కలుసుకున్న స్థానికులు తమ సమస్యలను ప్రస్తావిస్తూ తాగునీరు పూర్తిగా కలుషితమైందని, దీని వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటూ ఫిర్యాదు చేశారు. పరిస్థితి దారుణంగా వున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు జగన్‌కు మొరపెట్టుకున్నారు. కాగా పాదయాత్రలో వున్న జగన్‌ను ప్రముఖ నటుడు పృధ్విరాజ్ కలుసుకున్నాడు. పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ జగన్‌తో కలిసి అడుగులు వేశారు. పార్టీ పతాకాన్ని భుజాన వేసుకుని ఆయన జగన్‌తో కలిసి నడిచారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మండే ఎండల్లోనూ నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న జగన్ సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత బొబ్బనపల్లి మీదుగా మత్స్యపురి
శివారు చేరుకున్న జగన్‌ను స్థానిక కొబ్బరి ఒలుపు కార్మికులు కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. మరోవైపు లండన్‌లో నివసిస్తున్న ప్రవాసాంద్రులు విజయ్‌కుమార్, ఆశీర్వాదం జగన్‌ను కలిసి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆయనతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా మంగళవారం నాటి పాదయాత్రలో మత్స్యపురి వద్ద తనతో కలిసి నడుస్తున్న ఒక వృద్ధురాలి చెప్పు కప్పు ఊడిపోవడంతో వెంటనే జగన్ కాళ్లపై కూర్చుని ఆమె చెప్పును సవరించారు. ఎటువంటి భేషజానికి పోకుండా ఒక తల్లికి కొడుకు చేసిన విధంగానే జగన్ సేవ చేయడం చూసిన ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజలు, సామాన్యులపట్ల జగన్‌కున్న అభిమానం, చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. ఆ తరువాత సీతారామపురం చేరుకున్న జగన్ నర్సాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. కొప్పర్రు శివారు వద్దకు చేరుకున్న జగన్‌ను స్థానిక మహిళలు కలుసుకుని తమ బాధలు వెళ్లగక్కారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండటం లేదని, మంచినీరు కూడా అందడం లేదని వారు పేర్కొన్నారు. అంతకుముందు బద్దావారి పేటలో మంచినీటి సరఫరా కోసం ఖాళీ బిందెలతో ఆందోళన చేసిన మహిళలు పాదయాత్రలో అక్కడకు వచ్చిన జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. మరోవైపు కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు కూడా జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను చెప్పుకున్నారు. అందరికీ వెలుగులు పంచే తాము మాత్రం చీకట్లో మగ్గాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సర్వీసు క్రమబద్దీకరణ కావడం లేదని, వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని వారు పేర్కొన్నారు.

చిత్రం..కొబ్బరి కాయలు ఒలుస్తున్న జగన్