రాష్ట్రీయం

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో మంగళవారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం పునర్‌వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ తీర్మానాన్ని కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందించారు. కేంద్ర హోంమంత్రితత్వ కొత్త జోనల్ వ్యవస్థీకరణ ప్రతిపాదనను అన్ని కోణాల్లో పరిశీలించిన అనంతరం రాష్టప్రతి ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఈ అంశంలో చొరవచూపి త్వరగా రాష్టప్రతి ఆమోదం లభించేలా చూడాలని గవర్నర్‌ను సీఎం కోరినట్టు సమాచారం. తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని, రాష్టప్రతితో సమావేశం కావాలని భావించినప్పటికీ ప్రధాని విదేశీ పర్యటనలో బిజీగా ఉండటం వల్ల కలువలేకపోయిన విషయాన్ని గవర్నర్‌కు వివరించారని తెలిసింది. అలాగే ఆగస్టులో ప్రారంభించనున్న రైతు బీమా పథకం, జూన్ 2న రాష్ట్ర అవిర్భావ దినోత్సవ కార్యక్రమాలనూ సీఎం వివరించినట్టు సమాచారం.

చిత్రం..ఢిల్లీ పర్యటన, జోన్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై
.రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో చర్చిస్తున్న సీఎం కేసీఆర్