రాష్ట్రీయం

ఇది ఓటుబంధు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: రైతుబంధు పథకం ఓట్ల కోసం కాదని, రైతన్న అప్పుల పాలు కాకుండా ఉండేందుకే పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామనడం సాధ్యం కాదన్నారు. ఇది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కినట్టే ఉందని సిఎం విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం మానిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. రైతుబంధు పథకంపై మంగళవారం ప్రగతి భవన్‌లో రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డీనేటర్ల సమావేశమయ్యారు. ‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులు ఇతరులకు దానాలు చేసే స్థితిలో ఉండేవారు. కానీ పరిస్థితి రానురాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంభించిన విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిని రైతులు అన్ని విధాల నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వ్యవసాయ రంగాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. పంట రుణ మాఫీ చేసాం, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 నాటికి ప్రాజెక్టులన్ని పూర్తి చేసి పుష్కలంగ నీరు వస్తుంది. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇస్తున్నాం. భూ రికార్డులు ప్రక్షాళన చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసాం. పంటల పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి అందిస్తుంది. దీంతో పాటు రైతులకు జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడంలో రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషించాలి’ అని సిఎం అన్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు
రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదన్నారు. అన్ని విధాల ప్రతినెలా రాష్ట్రానికి రూ.10.500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2000 కోట్లు అప్పుల కిస్తులకే పోతుంది. మరో 6000 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలకు ఖర్చు అవుతుందని సిఎం వివరించారు. ఇక మిగిలిన 2500 కోట్లు మాత్రమే ప్రభుత్వం చేసే పనులకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా 2 లక్షల రుణ మాఫీ చేయాలంటే, ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించకుండా డబ్బులు జమ చేసినా 20 నెలల సమయం పడుతుందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించకుండా, మరే పని చేయకుండా 20 నెలలు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కానీ హామీలను ఇస్తుందని సిఎం కేసీఆర్ విమర్శించారు. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ రుణ మాఫీ చేస్తామని సాధ్యం కానీ హామీలను ప్రజలు అర్థం చేసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు.
రైతులంతా ఒకే రకం పంట వేసి నష్టపోకుండా డిమాండ్‌కు తగిన పంటలనే పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పండించే అపతీ గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సిఎం అన్నారు. నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు పండించాలన్నారు. స్థానిక రైతులు పండించిన కూరగాయలనే తినడం వల్ల ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరమని సిఎం అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. ఉత్పాదక పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలన్నారు. రైతు సమన్వయ సమితులు, అధికారులు ఇజ్రాయిల్ వెళ్లి వ్యవసాయ విధానాలను అధ్యాయనం చేయాలని సూచించారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో తెలంగాణ రైతులు సంఘటిత శక్తిగా మారారన్నారు. ఎక్కవ దిగుబడి వచ్చేలా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతు సమన్వయ సమితులు కృషి చేయాలని కో-ఆర్డీనేటర్లకు సిఎం కేసీఆర్ సూచించారు. రైతు జీవిత బీమా పథకం విజయవంతం చేయడానికి సమన్వయ సమితులు కృషి చేయాలని సిఎం పిలుపునిచ్చారు.