రాష్ట్రీయం

వెన్నుపోటు బాబు నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశ్వాస ఘాతకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అని, దేశంలో రాజకీయ అవినీతికి ఆధ్యుడని టీడీపీ బహిష్కుృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తనకు పదవి ఇవ్వనుందుకే ఆరోపణలు చేస్తున్నానని చంద్రబాబు చేయిస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం వెంపర్లాడలేదని, నేను పదవులు అడిగిన మాట వాస్తవమే అయితే నీ కొడుకు మీద ప్రమాణం చేస్తావా? అని బాబుకు సవాలు విసిరారు. కులగజ్జి కలిగిన చంద్రబాబు తనకిస్తానన్న రాజ్యసభ సీటును ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడని, ఆయన చేతిలో లేని గవర్నర్ పదవిని ఇస్తానని ఆశ చూపించాడని దుయ్యబట్టారు. తెలంగాణలో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసిన రేవంత్‌పై లేని చర్యలు నాపై ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నువ్వు నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి? తెలంగాణ ప్రజలు నిన్ను ఎప్పుడో సస్పెండ్ చేశారని విమర్శించారు. కేసీఆర్ పెట్టిన కేసులకు భయపడి రాత్రికి రాత్రే విజయవాడకు పారిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ
చవట. పార్టీని బ్రోతల్ హౌస్‌గా మార్చి రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతి మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబేనని, మాల, మాదిగల మధ్య రచ్చచేసి రాజకీయంగా లబ్దిపొందాలని చూశాడు తప్ప ఏనాడూ ఆ సమస్య పూర్తిగా పరిష్కరించాలని ఆలోచించలేదన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ అసెంబ్లీలో చేసిన విధంగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 29సార్లు ఢిల్లీకి వెళ్లినట్టు చంద్రబాబు చేసుకున్న ప్రచారం అబద్ధమని, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగారన్నారు. న్యాయం చేయకపోగా, నమ్మిన వారిని మోసం చేయడం చంద్రబాబు నిజస్వరూపమన్నారు.
చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదని, ప్రస్తుతం ఏపీ రాజధాని నిర్మాణం పేరిట వందలాది కోట్లు దోచుకుంటున్న చంద్రబాబు సింగపూర్‌తో పాటు వివిధ దేశాల్లో అవినీతి సొమ్మును భద్రపరుచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఆయనపై 29కేసులు సీబీఐలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ విచారిస్తే చంద్రబాబు ఏమేరకు అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లం అవుతుందన్నారు. కలియుగ దైవంగా కొలవబడుతున్న వెంకటేశ్వర స్వామిని సైతం తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నాడని మోత్కుపల్లి దుయ్యబట్టారు. చంద్రబాబు ఓడితే కాలినడకన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని మోత్కుపల్లి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు న్యాయమూర్తులకు పనికిరారని కేంద్ర హోంశాఖకు చంద్రబాబు లేఖ రాశారని వాటిని త్వరలోనే బయటపెడతానని మోత్కుపల్లి హెచ్చరించారు.