రాష్ట్రీయం

మహానాడులో మేనిఫెస్టోఫై చర్చ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తెలుగుదేశం పార్టీ గొప్పగా జరుపుకుంటుంన్న మహానాడులో ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలపై ఎందుకు చర్చించలేదో అనంతపురం పార్లమెంట్ సభ్యడు జేసీ దివాకరరెడ్డి చెప్పాలని వైఎస్‌ఆర్ సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఏదో చేస్తారని తెలుగు ప్రజలు ఓటేశారని, అయితే ఆయన ఏదీ ఒరగట్టలేదన్నారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తానని చెప్పి మహిళలలను మోసం చేశారన్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని జానీవాకర్‌రెడ్డిగా ఆయన అభివర్ణించారు. మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న జేసీ భావితరాలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలో ఆలోచన లేకుండా మాట్లాడడడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జేసీ మాట్లాడే భాషలో మాట్లాడవద్దని వైఎస్ జగన్‌మోహనరెడ్డి తమకు సూచించారన్నారు. జగన్ తమకు మాట్లాడే అవకాశం ఇస్తే దివాకరరెడ్డి పురాణాలు బయటపెడితే ఆయన రోడ్లమీద తిరగలేరన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని చంద్రబాబు పర్చిపోవడం విచారకరమన్నారు.