రాష్ట్రీయం

డెడ్ స్టోరేజీకి చేరువలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 28: నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ క్రమంగా డెడ్ స్టోరేజీ దిశగా పడిపోతోంది. 510 అడుగుల కనీస నీటి మట్టం (డెడ్ స్టోరేజ్)కు గాను ప్రస్తుతం 512 అడుగులుగా 136.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. సకాలంలో రుతు పవనాలు వచ్చి వర్షాలు సమృద్ధిగా కురిసిన పక్షంలో డెడ్ స్టోరేజీకి ముందుగానే సాగర్‌లో నీటి మట్టం పెరుగనుంది. లేదంటే గత రెండేళ్ల మాదిరిగా డెడ్ స్టోరేజీకి దిగువన నుంచి కూడా తెలంగాణ తాగునీటి అవసరాలకు నీటి విడుదల తిప్పలు తప్పని పరిస్థితి నెలకొననుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణాబోర్డు కేటాయించిన నీటి కోటాను వినియోగించుకోగా తెలంగాణ తాగునీటి అవసరాలకు సంబంధించి నాలుగు టీఎంసీల కోటా వినియోగించుకోవాల్సి వుంది. ఇంతలో వర్షాలు, వరదలు రాని పక్షంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోనుంది. సాగర్ నుండి రోజు సగటున 900 క్యూసెక్కులు ఎస్‌ఎల్‌బీసీ (ఎఎమ్మార్పీ)కి విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 700 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతుంది. ఈ దఫా గడిచిన యాసంగి పంట సీజన్‌లో తొలిసారిగా సాగర్ టెయిల్ పాండ్ వరకు కూడా సాగునీటి విడుదల చేసినప్పటికి గత రెండేళ్ల కంటే కూడా సాగర్ నీటి మట్టం ఈ ఏడాది ఇదే సమయానికి డెడ్ స్టోరేజీకి ఎగువన ఉండటం గమనార్హం. గత ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో సెప్టెంబర్ 20వరకు కూడా సాగర్ డెడ్ స్టోరేజీకి దిగువగా 499 అడుగుల నీటి మట్టం కొనసాగడం గమనార్హం. దీంతో జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు తాగునీటిని అందించేందుకు పుట్టంగండి ఏఎమ్మార్పీ మోటార్లకు సాగర్ జలాశయంలో నాలుగు కోట్లతో డ్రెడ్జింగ్ చేసి మరి నీరందించారు. సెప్టెంబర్ 24 నాటికి శ్రీశైలం నుండి నీటి విడుదలతో 511అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సాగర్ జలాశయంలో ప్రస్తుత నిల్వ నీటిని పొదుపుగా వాడుకోవాల్సివుంది. లేనట్లయితే గత ఏడాది మాదిరిగా మంచినీటికి సైతం గడ్డు పరిస్థితి తలెత్తక తప్పదు.
*
సంవత్సరం నీటిమట్టం టీఎంసీలు
(అడుగుల్లో)
2009 504.50 191.10
2010 520.60 227.60
2011 554.10 305.36
2012 511.80 209.46
2013 519.50 148.36
2014 517.50 144.75
2015 514.40 139.26
2016 506.80 126.30
2017 502.20 119.76
2018 512 136.09
(28మే నాటికి)