రాష్ట్రీయం

పర్యావరణాన్ని రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, చైతన్యం కలిగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై ప్రచారం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) నిర్ణయం మేరకు ప్రతిఏటా జూన్ ఐదున పర్యావరణ దినోత్సవాన్ని ఏటా ఒక దేశం నిర్వహించాల్సి ఉంది. ఈ సంవత్సరం ఈ బాధ్యత భారత ప్రభుత్వానికి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. ‘ప్లాస్టిక్ వినియోగం-దుష్ఫలితాలు-ప్రజల బాధ్యత’ అంశంపై విస్తృతంగా చర్చలు జరపాలని సూచనలు జారీ చేసింది. ఈ అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం ద్వారా పెరుగుతున్న కాలుష్యంపై విస్తృతంగా చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. నిత్యజీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని, ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను కేంద్రం తన సర్క్యులర్‌లో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొన్ని సూచనలు కూడా ఇచ్చింది.