రాష్ట్రీయం

దోస్త్‌కు పెరిగిన దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ ఆన్‌లైన్ ద్వారా 1,31,415 మంది దరఖాస్తు చేశారు. ఇంత వరకూ 1,43,657 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,36,788 మంది ఫీజు చెల్లించారు. ఇందులో 1,27,122 మంది దరఖాస్తులను ఇప్పటికే ఆమోదం పొందగా, అభ్యర్ధులు 1,24,877 కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. దరఖాస్తు చేసిన వారిలో తెలంగాణ బోర్డులో పరీక్ష రాసిన వారు 1,29,285 మంది కాగా, ఆంధ్రా బోర్డు నుండి పరీక్ష రాసిన వారు 706 మంది, ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 430 మంది, సిబిఎస్‌ఇ అభ్యర్ధులు 483 మంది, పాలిటెక్నిక్ డిప్లొమో చేసిన వారు 204 మంది, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్ చదివిన వారు 36 మంది, ఐసీఎస్‌ఇ నుండి చదివిన వారు 79 మంది ఉన్నారు. అలాగే దాదాపు దేశంలోని అన్ని బోర్డుల నుండి పరీక్ష రాసిన వారు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేయడం గమనార్హం.
ఎమ్సెట్ సర్ట్ఫికేట్ల పరిశీలనకు 15,557 మంది
ఎమ్సెట్ ఇంజినీరింగ్ స్ట్రీంలో అడ్మిషన్లకు 25వేల ర్యాంకు వరకూ ఆహ్వానించగా 15,557 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనలకు హాజరయ్యారు. 10వేల వరకూ ర్యాంకుల్లో ఉన్న వారు 5905 మంది కాగా, 10001 నుండి 25వేల ర్యాంకు వరకూ 9652 మంది హాజరయ్యారు. ఇందులో ఇంత వరకూ 1540 మంది తమ వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారు. 30వ తేదీన 25001 నుండి 40వేల ర్యాంకు వరకూ వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నామని కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు.
అసిస్టెంట్ కంట్రోలర్‌పై క్రిమినల్ కేసు
కుటుంబ తగాదాల్లో భాగంగా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ కంట్రోలర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎ కిరణ్‌కుమార్‌ను విధుల నుండి తొలగించారు. కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్ ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చి, మోసం చేసిన ఘటనలో ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.