రాష్ట్రీయం

రెండో రోజూ అదే గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 29: ఎంసెట్ సర్ట్ఫికెట్ల అప్‌లోడ్ పూర్తి చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినప్పటికీ వెబ్ ఆప్షన్ రాకపోవడంతో విద్యార్థుల్లో చోటుచేసుకున్న గందరగోళం రెండో రోజు కొనసాగింది. తొలి సారిగా ధృవీకరణ పత్రాల పరిశీలన, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేపట్టారు. ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే సర్ట్ఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వారు కళాశాలల ఎంపిక నిమిత్తం ఆన్‌లైన్ విధానంలోనే జరిగే కౌనె్సలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. దీనికోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. తొలి రోజు సోమవారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన పలువురికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ జారీ కాలేదు. ఈ రెండూ ఉంటేనే విద్యార్థులు ఆన్‌లైన ద్వారా తాము చేరదలచుకున్న కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు సహాయ కేంద్రాలను సంప్రదిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌లో చోటుచేసుకున్న చిన్న సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని, విద్యార్థులు, తల్లిదండ్రులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. విశాఖలో అదనంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.