రాష్ట్రీయం

దేవస్థానం భూములు.. ప్రైవేట్ వ్యక్తుల కైంకర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 30: పాలక వర్గాల అలసత్వం, అధికారుల అవినీతితత్వం వెరసి అత్యంత విలువైన దేవాలయాల భూములు అన్యాక్రాంతాలు అవుతున్నాయి. కోర్టు కేసుల్లో ఉన్నా, దేవాలయాలకు చెందిన భూములైనా, భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో వాటి జోలికి పోవద్దని స్పష్టమైన ఆదేశాలున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామానికి చెందిన జి.వి.సదాశివరావు బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామ శివారులో సర్వే నెంబరు 293లోని తన ఏడు ఎకరాల తొమ్మిది గుంటల పంట భూమిని ధర్మపురి దేవస్థానానికి 1977లో దానం చేసారు. ఈ భూమిని విక్రయించే హక్కును దేవస్థానానికి ధారాదత్తం చేశారు. ఈ భూమిని ధర్మపురి దేవస్థానానికి స్వాధీన పరిచే చర్యలు తీసుకోవాలని నాటి ఆర్డీఓ, ఎల్.డిస్ నెంబర్ బి/1014583 తేదీ: 21-1-1984 ద్వారా జగిత్యాల తహసీల్దారును ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నాటి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వీరభద్ర శర్మ, లేఖ సంఖ్య 56/80 తేది: 10-02-84 ద్వారా యజమాని సదాశివ రావు పేరును రికార్డుల నుండి తొలగించి, మ్యుటేషన్ కబ్జా అమలు చేస్తూ, తమ స్వాధీనం చేయాలని జగిత్యాల తహశీల్దారుకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
అయితే 1984 తర్వాత ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు పట్టించుకోక పోవడంతో భూమి విషయం మరుగున పడింది. తర్వాత అధికారులు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. ధర్మపురి మండల రెవెన్యూ అధికారిని 14-08-98వ తేదీన దేవస్థానం కార్యనిర్వహణాధికారి మ్యుటేషన్ అమలు చేయాలని లేఖ ద్వారా కోరారు. ఈ విషయంలో కాలయాపన జరుగుతూ ఎమ్మార్వో నుండి సమాధానం రాకపోవడంతో, జగిత్యాల సబ్ కలెక్టర్‌కు 30-10-98న ఇ.ఓ విజ్ఞప్తి చేశారు. తర్వాతి కాలంలో రెవెన్యూ అధికార్ల అవినీతి కారణంగా, ఈ భూములకు సంబంధించి పహణీ 16వ నెంబరు కాలంలో ఆక్రమణ దార్ల పేర్లను వరుసగా రెండుమూడేళ్లకోమారు మారుస్తూ వచ్చారు. చివరకు 1993-94లో మరిపల్లి రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి పేర్లు వచ్చి చేరాయ. ఇదిలా ఉండగా, నాటి దేవాదాయ శాఖామాత్యులు జువ్వాడి రత్నాకర్ రావు ఆదేశాల మేరకు 12.5.2007న ధర్మపురి ఎమ్మార్వో రఘుపతి ఆదేశంపై రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సదరు భూమి పంచనామా నిర్వహించి, దేవస్థానం ఇంచార్జి ఇఓగా ఉన్న ఆర్‌జెసి చంద్రకుమార్ హయాంలో దేవస్థానానికి స్వాధీన పరిచి, నివేదిక సమర్పించారు. అదే రోజు దేవస్థానం బోర్డును భూమిలో ప్రదర్శించారు. అయితే దీనిపై మర్రిపెల్లి రాజేశ్వర్ రెడ్డి తదితరులు జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. దేవస్థానం కూడా ఆక్రమణదారులను తొలగించి భూములను తమకు స్వాధీనం చేయాలని కేసువేసింది. దీనిపై ఏవిధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా హైకోర్టులో రాజేశ్వర్ రెడ్డి తదితరులు స్టే పొందారు. ఈ స్టే వెకేట్‌కై దేవాదాయశాఖ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ద్వారా కౌంటర్ అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలోఉంది. గోపులాపూర్ ధర్మపురి దేవస్థానం భూములకు సంబంధించి, కోర్టులో కేసులు నడుస్తున్నా, కబ్జాదారులకు పాసుపుస్తకాలు, చెక్కులు రావడమే విచిత్రం. అయతే దేవస్థానం ఎసి,ఇఓ ఫిర్యాదుపై వాటిని నిలిపి వేశారు.
అలాగే ధర్మపురి మండలంలోని రాజారాం గ్రామానికి చెందిన ఆలయాల భూములను ఆక్రమించిన వారికి కూడా ప్రస్తుతం పట్టాలు, చెక్కులు ఇవ్వడం దారుణం. రాజారాం గ్రామానికి చెందిన సాంబశివాలయానికి సర్వేనెంబర్లు 1087లో 8ఎకరాలు, 1461లో 19గుంటలు, 2568లో 11గుంటలు, 91లో 1.04ఎకరాలు, 1044లో 1.06ఎకరాల భూమి; అలాగే వేంకటేశ్వరాలయానికి సర్వే నెం.47లో 4.21ఎకరాలు, 1138లో 32గుంటలు, 1136లో 5.10ఎకరాల భూమి ఉన్నట్లు పాత రికార్డులలో నమోదై ఉంది. మరి ఈ ఆలయాల భూములను కబ్జా చేసిన వారికి పట్టాలు, చెక్కులు రావడం రెవెన్యూ అధికార్ల అవినీతికి నిలువుటద్దం. ఈ భూములను దేవాలయాలకు తిరిగి అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.