రాష్ట్రీయం

వర్షాకాల సమావేశాల్లో చర్చకు నోటీసివ్వండి : ఉండవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 30: చట్ట ప్రకారం రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లేనందున ఉభయ సభల్లో విభజన జరిగిన తీరుపై చర్చకు ప్రయత్నించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలపై పునరాలోచన చేసుకోవాలని స్పీకర్ గ డువు ఇచ్చినందున వర్షాకాల సమావేశాల వరకు వేచిచూసి, చర్చ జరిగేలా నోటీసు ఇవ్వాలని కోరారు. ఇలాచేస్తే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వైసీపీ అయినా ఆలోచన చేస్తోందనే భావన ప్రజలకు కలుగుతుందన్నారు. తూ.గో జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఉండవల్లి విలేఖర్లతో మాట్లాడారు. ఒకవేళ చర్చకు స్పీకర్ అనుమతించకపోతే ఆ రోజే పార్లమెంట్‌లో అక్కడికక్కడే రాజీనామాలు చేస్తే మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో జరిగిన వ్యవహారంపై చర్చకు పెట్టాలని నోటీసులివ్వాలని కోరారు. ఇదే విషయాన్ని తాను గ తంలో టీడీపీకి కూడా తెలియజేస్తూ చంద్రబాబుకు లేఖ రాశాన ని ఉండవల్లి గుర్తుచేశారు. ఆ రెండు రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో విడుదలైన చర్చా ప్రతులను బట్టి ఎక్కడా బిల్లు ఆమోదం పొందిన తీరులేదని స్పష్టమవుతోందని, ఈ ప్రతులను మీడియా కు చూపించారు.