రాష్ట్రీయం

కరవుతీరా వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలంగాణ రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు జూన్ ఐదోతేదీ వరకు వచ్చే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కేరళలో మంగళవారం ప్రవేశించిన రుతుపవనాలు బుధవారానికి చాలా వేగంగా ముందుకు కదిలాయి. వచ్చే 48 గంటల్లో ఇవి మరింత ముందుకు కదులుతాయని, జూన్ 3 నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండి వివరించింది. మహారాష్ట్ర, గోవాలలో కూడా జూన్ 6 నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రస్తుతం నైరుతీరుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్నాటకల్లోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావం వల్ల కర్నాటక, కేరళలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నాటకలోని మంగళూరులో 29 సెంటీమీటర్లు (కుంభవృష్టి), మరికొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లు నమోదైంది. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుండి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా ఉండగా దీర్ఘకాలిక వాతావరణ బులెటిన్‌ను (లాంగ్ రేంజ్ ఫోర్‌క్యాస్ట్-ఎల్‌ఆర్‌ఎఫ్) ఐఎండి బుధవారం విడుదల చేసింది. ఇంతకు ముందే 2018 ఏప్రిల్ 16 న తొలి బులెటిన్ విడుదలైంది. ఇప్పుడు రెండోబులెటిన్ జారీ అయింది. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సాధారణం వర్షాలతో పోలిస్తే 93 శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దేశం మొత్తంలో నాలుగు శాతం ఇటుఅటుగా 97 శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగానూ, తీవ్ర వాయుగుండంగా మారి మయన్మార్ వైపు వెళ్లిందని ఐఎండి ప్రకటించింది. ఇది బుధవారానికి బలహీన పడిందని వివరించారు.