రాష్ట్రీయం

1నుంచే స్కూళ్ల పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకూ పొడిగించాలని, 12న పునఃప్రారంభించాలని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థులు, మరోపక్క ఉపాధ్యాయ సంఘాలు ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం జూన్ 1నుంచే స్కూళ్ల ప్రారంభమని బుధవారం స్పష్టం చేసింది. 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని స్కూళ్లలో పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని పేర్కొంది. 3 ఆదివారం కావడంతో సెలవు. 4 నుంచి 8 వరకూ ఒంటిపూట బడులు. 9 రెండో శనివారం, 10 ఆదివారం కావడంతో సెలవులిచ్చారు. 11నుంచి పూర్తిస్థాయ స్కూల్స్ నడుస్తాయ. మరో పక్క ఒంటిపూట బడుల సమయంలోనే బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై 11 వరకూ బడిబాట నిర్వహిస్తారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను గుర్తించి, తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చేందుకు వీలుగా బడిబాట నిర్వహిస్తారు. గత ఏడాది ఇటువంటి ప్రయత్నంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెరిగాయి. మరోపక్క ఫీజులు లేకుండా, ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా యూనిఫారం, ఉచితంగా వర్కుబుక్‌లను ఇవ్వడమేగాక, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు పనికి ఆహార పథకం కింద కూడా ఉపాధి కల్పించడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రాయోజనాత్మకంగా ఉంటుందని ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో భారీ ఎత్తున ఫీజులు చెల్లించే బదులు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఫీజుల భారం ఉండబోదని వారు చెబుతున్నారు.