రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు సాధ్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 30: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదంటూ సీఎం కేసీఆర్ ప్రజలను దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) మూడు రోజుల రిలే నిరహార దీక్షల ముగింపు కార్యక్రమానికి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 రాష్ట్ర బడ్జెట్ 1.74 లక్షల కోట్లని, అనంతరం 1.90 లక్షల కోట్లకు చేరుకుంటుందని, అలాంటప్పుడు రైతులకు 2 లక్షల చొప్పున రుణమాఫీ ఏకకాలంలో చేయడం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఏడుకొండల స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు ఉందని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడన్నారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లను, భూమిలేని నిరుపేద దళిత రైతులకు మూడెకరాల భూపంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలం కాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంటును సరఫరా చేసినట్లు గుర్తు చేసారు. ప్రస్తుతం ప్రభుత్వం 24 గంటల కరెంటును ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోందని, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడటం, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే సమయానికి విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో 24 గంటల కరెంటును ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసారు. రానున్న ఎనిమిది, పది నెలల్లోగా సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేసి శంకుస్థాపన చేయాలని, లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వైద్య కళాశాలను మంజూరు చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే అందుకు పోలీసులు, ఇతర శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా అధికారుల నుండి మ్యూలం తీసుకుంటామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి బాసటగా నిలిచేందుకు వెళ్లిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డిపై కేసు బనాయించి జైల్లో పెట్టించిన కేసీఆర్‌ను గజ్వేల్ నియోజకవర్గ ఓటర్లు ఓడించి బుద్ధి చెప్పాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కొండాపూర్ మండలంలో రైతులకు ఇచ్చిన 250 ఎకరాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి లాక్కుంటుందని, ఆ రైతులు భయపడవద్దని, తాము అండగా నిలుస్తామని ధైర్యం కల్పించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాల సాధనకై నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా గురువారం తలపెట్టిన నియోజకవర్గ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జగ్గారెడ్డి రిలే నిరహార దీక్షను నిమ్మరసం తాగించి ఉత్తమ్‌కుమార్ ముగింపు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.