రాష్ట్రీయం

రాష్ట్రాల సరిహద్దు వివాదానికి తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, మే 30: చాలాకాలంగా వివాదాస్పదంగా మారిన కర్నాటక, ఆంధ్ర సరిహద్దు బౌండరీల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర బృందం కసరత్తు చేపట్టింది. రెండు నెలల క్రితం అత్యున్నత న్యాయస్థానం కలగజేసుకుని వివాదాస్పద ప్రాంతమైన కర్నాటక, ఆంధ్ర సరిహద్దు బౌండరీలను వెంటనే గుర్తించి త్వర లో ఒక నివేదికను అందజేయాలని సీఈసీ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. దీంతో సరిహద్దు బౌండరీలు పక్కాగా గుర్తించడానికి శాటిలైట్ ద్వారా సర్వే చేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల క్రితం కర్నాటక రాష్ట్రం బళ్లారికి చేరుకుంది. మంగళవారం కర్నాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన అటవీ, ల్యాండ్ రెగ్యులర్ సర్వే అధికారులను బళ్లారికి పిలిపించుకుని చర్చించారు. బుధవారం అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ ప్రాంతంలో సెంట్రల్ ఎంపవర్ కమిటీ బృందం పవన్‌కుమార్ పాండ్య ఆధ్వర్యంలో సరిహద్దు బౌండరీలను పునఃపరిశీలించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాల్ మండలంలో ఖనిజ సంపద విస్తారంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ లీజు పొందిన గాలి జనార్థన్‌రెడ్డి తన అంగబలం, ధనబలంతో సరిహద్దు బౌండరీలను ధ్వంసం చేసి విలువైన ఖనిజ సంపదను విదేశాలకు తరలించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని అప్పట్లో ప్రతిపక్షంలో తెలుగుదేశం, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించాయి. దీంతో ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లింది. చివరకు ఈ సరిహద్దుల వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఓబుళాపురం మైనింగ్ ప్రాంతంలోని అన్ని మైనింగ్ లీజులను రద్దు చేస్తూ తవ్వకాలను నిలిపివేసి చెదిరిపోయిన సరిహద్దు బౌండరీలను మళ్లీ గుర్తించాలని సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది. దీంతో త్రిసభ్య కమిటీ, సీఈసీ కమిటీలు పలుమార్లు సర్వే చేసినా ఖచ్చితమైన బౌండరీలను గుర్తించలేకపోయాయి. దీనికి తోడు ఇరు రాష్ట్రాల అధికారులు సహకరించకపోవడంతో బౌండరీల గుర్తింపు వీలుకాలేదు. దీంతో 9 సంవత్సరాలుగా సరిహద్దు వివాదం మిగిలిపోయింది. మళ్లీ సుప్రీం కోర్టు కలుగజేసుకుని రెండు, మూడు నెలల్లో సరిహద్దు బౌండరీలను గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఈసీ కమిటీని ఆదేశించింది. సీఈసీ కమిటీ బృందం నాయకుడు జనరల్ ఆఫ్ సర్వేయర్ పవన్‌కుమార్ పాండ్య, కేంద్రం సర్వే ఆఫ్ సెటిల్‌మెంట్ అధికారి మణీష్ మోత్కర్ ఆధ్వర్యంలో ఆంధ్రా, కర్నాటక అధికారులు ఓబుళాపురం మైనింగ్ ప్రాంతంలో మళ్లీ సర్వే చేపట్టారు. ముందుగా ఈ సర్వే బృందం కర్నాటక పరిధిలోని విఠలాపురం, ఆంధ్రా పరిధిలోని మలపనగుడి, సిద్దాపురం, ఓబుళాపురం గ్రామాల మధ్య బౌండరీలను పరిశీలించింది. కర్నాటక, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో 46 ఫారెస్టు బౌండరీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులకు చెందిన 12 బౌండరీలు ఉండగా అందులో బుధవారం 1,2,3,4,6 బౌండరీలను గుర్తించారు. దీనికి ఇరురాష్టల్ర అధికారులు కూడా అంగీకరించారు. ఇందులో 5 బౌండరీని ఏపీ అధికారులు అంగీకరించలేదని తెలిసింది. ఇది సరిగా లేదంటూ ఏపీ అధికారులు అంగీకరించేదని తెలిసింది. మిగిలిన మరో 6 బౌండరీలు సర్వే అధికారులు గుర్తించాల్సి ఉంది. అలాగే గ్రామాల సరిహద్దుల బౌండరీలకు చెందిన నాలుగు బౌండరీలను కూడా పరిశీలించారు. ఇదే చివరి సర్వే కావడంతో సెంట్రల్ సర్వే బృందం అధికారులు పక్కాగా ఇరురాష్ట్రాల అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయిలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.

వివాదానికి తావులేదు:డీఎఫ్‌ఓ చంద్రశేఖర్
ఆంధ్రా, కర్నాటక సరిహద్దుల బౌండరీలు గుర్తించడంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పర సహకారంతో సమస్యకు పరిష్కారం కనుగొంటున్నారని అనంతపురం జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర బృందం సూచనల మేరకు పట్టింపులకు వెళ్లకుండా సామరస్యంగా సరిహద్దు వివాదం తొలగిపోతుందని ఆయన అన్నారు. తమ పరిధిలో ఉన్న చెట్టు, సెంటు భూమి కూడా వదలమని పక్క రాష్ట్రానికి చెందిన ఒక్క సెంటుభూమి కూడా తీసుకోమని ఆయన తెలిపారు. త్వరలో ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదం సమసిపోతుందని అన్నారు.