రాష్ట్రీయం

మరో మూడ్రోజులు ఇంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఈ వేసవిలో ఎప్పుడూ లేనంతగా బుధవారం పగటి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాయువ్య దిశగా వీస్తున్న గాలులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్ర పెరుగుదల చోటుచేసుకుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఈ పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సారి కాస్త ముందుగానే రుతుపవనాలు దేశంలో ప్రవేశించగా, జూన్ 2 నాటికే రుతుపవనాల ప్రభావం రాష్ట్రాన్ని తాకుతుందని అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రజానీకాన్ని బేజారెత్తిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బుధవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సాధరణం కంటే 3నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీలు నమోదు కాగా, నందిగామ, గన్నవరం 43 డిగ్రీలు, నెల్లూరు, బాపట్ల, ఒంగోలు 42 డిగ్రీలు, కావలి 41 డిగ్రీలు, విశాఖ, నర్సాపురం 39 డిగ్రీలు తుని, కాకినాడ 38 డిగ్రీలు, మచిలీపట్నం 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.