రాష్ట్రీయం

మహిళా న్యాయవాది దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మే 30: చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం పట్టపగలు మహిళా న్యాయవాది దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు జితేంద్ర, నాగజ్యోతి దంపతులు వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం అయింది. కుమారుడు హైదరాబాద్‌లో లా చదువుతున్నాడు. కాగా రెండేళ్లుగా భర్త, పిల్లలకు దూరంగా ఉంటున్న మహిళా న్యాయవాది నాగజ్యోతి కోర్టు వెనుక బ్యాంకర్స్ కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటోంది.గుర్తుతెలియని దుండగులు రెక్కీనిర్వహిస్తూ ఆమెను వెంటాడేవారని తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నాగజ్యోతి తన స్నేహితురాలి ఇంటికి వచ్చి తిరిగి మూడుగంటల ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అప్పటికే పథకం వేసిన గుర్తుతెలియని దుండగులు ఓ వాహనంలో వచ్చి నాగజ్యోతి ద్విచక్రవాహనాన్ని అడ్డుకుని గొంతుకోసేశారు. తప్పించుకునే యత్నంలో దాడిచేయగా అక్కడికక్కడే కొట్టుమిట్టాడుతూ కుప్పకూలిపోయింది. పోలీసులు కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.