రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటకతో మొదలై రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తామని, ఇక తమ దృష్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపైనేనని కేంద్ర ఐటి, న్యాయశాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. గురువారం హైదరాబాద్ వచ్చిన రవి శంకర్ ప్రసాద్ మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం 48 నెలల్లో సాధించిన విజయాలను వివరించారు.
అనంతరం ఆయన వివిధ పత్రికల సంపాదకుల సమావేశంలో మాట్లాడారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన మేథావుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వానికి దక్కిన అంతర్జాతీయ ఖ్యాతి, పొరుగుదేశాలతో సయోధ్య, కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అమలు తీరు, వివిధ రాష్ట్రాలతో సంబంధాలు, ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలు,
తాజాగా జరిగిన బైపోల్ ఫలితాలు, ఐటి శాఖ పనితీరు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మీడియాకు సవివరమైన కరపత్రాలను అందజేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తాం అని గట్టిగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు తరలింపునకు సంబంధించి మాట్లాడుతూ ఆ రాష్ట్రం అమరావతిలో భవనం నిర్మిస్తే దానిని నోటిఫై చేస్తామని, లేకుంటే తాత్కాలిక భవనానికి తరలించేందుకు వీలుగా మరికొన్ని భవనాలను కమిటీ చూసిందని, ఏదైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే దానిని కేంద్రం నోటిఫై చేస్తుందని చెప్పారు. ఐటిఐఆర్‌ల ఆలోచన రద్దు చేసుకున్నామని చెప్పిన రవి శంకర్ ప్రసాద్ , ఐటిఐఆర్‌కు పెద్ద ఎత్తున భూమి సేకరించాల్సి ఉంటుందని, అది పట్టణాల్లో సాధ్యమయ్యేది కాదని గుర్తించామని అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తున్న ఫ్రంట్ గురించి ప్రస్తావించగా, ఎన్ని ‘ఫ్రంట్’లు వచ్చినా బీజేపీయే ఫ్రంట్(ముందుంటుంది) అని వ్యాఖ్యానించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు సరిపడా సాయం కేంద్రం చేయడం లేదనే ఆరోపణలను ఆయన తిరస్కరించారు. అన్ని రాష్ట్రాలకూ సమన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కేంద్రం సాయంలో ఎలాంటి వివక్ష లేదని అన్నారు.

చిత్రం..బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన మేథావుల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్