రాష్ట్రీయం

విద్యుత్ సిబ్బందికి వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రజల, ఉద్యోగుల పక్షపాతిగా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి పీఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చామన్నారు. గడచిన నాలుగేళ్లలో వినియోగదారులపై అదనంగా విద్యుత్ ఛార్జీల భారం మోపకుండానే ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు
తెలిపారు. 2018 పీఆర్సీ, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ కార్యదర్శులతో మాట్లాడి ఈ విషయంలో
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 31,543 ఉద్యోగులతోపాటు 26,493 మంది పెన్షన్‌దారులు మొత్తం 58,036 మందికి అంటే అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. 15ఏళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లు దాటిన వారికి మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం సామరస్యపూరక వాతావరణంలో ఒక ఒప్పందానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకున్నందున ప్రభుత్వంపై అదనంగా రూ.860 కోట్ల భారం పడుతుందని చెప్పారు. మరణించిన 32 మంది రెస్కో (గ్రామీణ విద్యుత్ సహకార సంఘం) ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 9 రెస్కోలు ఉన్నాయని, వాటిలో నష్టాలు వచ్చే ఏడింటిని ప్రభుత్వ శాఖలో కలిపివేసినట్లు చెప్పారు. విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు అతి తక్కువతో దేశంలో మొదటి స్థానంలో మన రాష్ట్రం నిలిచిందని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. దేశంలో ఈ నష్టాలు 18 శాతంగా ఉన్నాయని, దాన్ని 15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని, అయితే మన రాష్ట్రంలో 9.72 శాతం మాత్రమే ఉందని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణలు, ఉద్యోగుల కృషి ఫలితంగా ఇది సాధించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ విద్యుత్ రేట్లు కూడా పెంచకుండా తమకు 25 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ టి.చంద్రశేఖర్, కన్వీనర్ వేదవ్యాస్‌లు కృతజ్ఞతలు తెలిపారు.