రాష్ట్రీయం

మరో కళింగాంధ్ర ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, మే 31: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనందున మరో కళింగాంధ్ర ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. గురువారం విజయనగరం జిల్లా కురుపాంలో పవన్‌కళ్యాణ్ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ఒక్కటే అభివృద్ధి అనుకుంటూ మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ఇదే కొనసాగితే మరో కళింగాంధ్ర ఉద్యమం తప్పదని
పేర్కొన్నారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వస్తున్నాయే తప్ప
ప్రజా సమస్యల పరిష్కారానికి కాదన్నారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ముందుకు వెళుతున్నానని, అధికారం కోసం కాదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా పదవుల కోసం పాకులాడకూడదన్న ఆలోచనతోనే ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే టీడీపీతో కలిసి పనిచేశానన్నారు. అయితే టీడీపీ, బీజేపీ మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ మొండి చేయి చూపించగా టీడీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం అప్పుడే పోరాటాలు చేసి ఉంటే ఇప్పుడీ అవస్థలు ఉండేవి కాదన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించేదన్నారు. 90 శాతం మంది గిరిజనులున్న కురుపాం నియోజకవర్గంలో సమస్యలపై పోరాట యాత్ర చేసేందుకు వచ్చానన్నారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో 13కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్ణపాడు, లాబేసు వంతెన నిర్మాణాలకు 10 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. ఏడాదిలోగా వంతెన నిర్మాణం పూర్తిచేయకుంటే రాబోయే రోజుల్లో జనసేన కార్యకర్తలు తమ సత్తా చూపిస్తారని హెచ్చరించారు.కురుపాం నియోజకవర్గానికి చెందిన 5 మండలాల నుంచి భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.