రాష్ట్రీయం

పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 31: గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగుపాటుతో కూడిన భారీవర్షం కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవటంతో పలు చోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా పిడుగుపాటుకు ఐదుగురు మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నరసరావుపేట, సత్తెనపల్లి, తెనాలి, క్రోసూరు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నరసరావుపేట, సత్తెనపల్లి, తెనాలి పట్టణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. సత్తెనపల్లి-మాచర్ల రహదారిలో భారీవృక్షాలు నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దొండపాడు గ్రామంలో చిన్నపురెడ్డి శివారెడ్డి (60) పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. నరసరావుపేట మండలం పసుమర్రు గ్రామంలో అనంత పెద్దబాబు (30), ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడులో శివాలశెట్టి ప్రసాద్ (50) పొలం పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు గురై మృతిచెందారు. కాగా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన కుంబా కోటేశ్వరమ్మ (67)తో పాటు ముప్పాళ్ల మండలం, నార్నెపాడుకు చెందిన మరో రైతు దాసరి పుల్లయ్య (27) పిడుగుపాటుతో మృత్యువాతపడ్డారు. కాగా దొండపాడు గ్రామానికి చెందిన అంచె శివకుమారి, లింగంపల్లి రాజేశ్వరి, మాగంటి అంజమ్మ, 88 తాళ్లూరుకు చెందిన దారం లక్ష్మయ్య, దార్ల కోటేశ్వరరావు, నరసరావుపేట, పసుమర్రుకు చెందిన అన్నం చినకోటేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కలెక్టర్ కోన శశిధర్ నేతృత్వంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.