రాష్ట్రీయం

ఉద్యోగాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 18,428 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు విభాగాలుగా రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను జూన్ 9 నుంచి 30 వరకు స్వీకరిస్తారు. కానిస్టేబుల్ విభాగంలో 16,925 పోస్టులను భర్తీకి విడిగా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కానిస్టేబుల్: సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 5909, ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో 5273, ఎస్‌ఎఆర్‌సిపిఎల్‌లో 53, టిఎస్‌ఎస్‌పిలో 4816, స్పెషల్ పోలీస్ డిపార్టుమెంట్‌లో 485, ఫైర్ సర్వీస్‌లో 168, జైళ్లశాఖలో వార్డర్ పోస్టులు 186, మహిళా వార్డర్ పోస్టులు 35 కలిపి మొత్తం 16,925 పోస్టుల భర్తీ చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు జూలై 1 నాటికి 18 ఏళ్లు దాటి, 22 ఏళ్లు నిండకుండా ఉండాలి. అలాగే ఈ ఏడాది జూలై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
సబ్ ఇన్‌స్పెక్టర్: ఈ విభాగంలో మొత్తం 1217 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లో బోర్డు స్పష్టం చేసింది. వీటిలో సివిల్ విభాగంలో 710, ఆర్మ్‌డ్ రిజర్వులో 275, పురుషుల విభాగంలో రిజర్వు ఎస్‌ఐలు 5, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టిఎస్‌ఎస్‌పి) విభాగంలో 175, టిఎస్‌ఎస్‌పి 15వ బెటాలియన్ పురుషుల విభాగంలో 16, ఫైర్ సర్వీస్‌లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు 19, జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులు 15, జైళ్లశాఖలో అసిస్టెంట్ మాట్రన్ పోస్టులు 2 కలిపి మొత్తం 1217 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. దేశంలోని ఏ విశ్వవిద్యాలయం నుంచైనా డిగ్రీని విద్యార్హతగా పొంది ఉండాలి. కమ్యూనికేషన్‌లో కానిస్టేబుల్స్: ఐటి, కమ్యూనికేషన్ విభాగంలో 142 కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో
మెకానిక్స్ 19, డ్రైవర్ (పురుష) పోస్టులు 70 కలిపి మొత్తం 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి, 25 ఏళ్ల మించకుండా ఉండాలి. కనీస విద్యార్హత పదవ తరగతి పొంది ఉండాలి. పోస్టులను బట్టి సాంకేతిక అర్హత, వయోపరిమితిని విధానాలను బోర్డు ప్రకటించింది.
కమ్యూనికేషన్స్‌లో ఎస్‌ఐ: ఐటి, కమ్యూనికేషన్ల విభాగంలో 55 ఎస్‌ఐ పోస్టుల భర్తీని ప్రకటించింది. వీటిలో ఎస్‌ఐ పోస్టులు 29, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఎఎస్‌ఐ పోస్టులు 26 కలిపి మొత్తం 55 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు వయోపరిమితి జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటరాదు. జూలై 1 నాటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బిఈ, బిటెక్, లేదా ఐటి, లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలని బోర్డు వెల్లడించింది.
రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన మొత్తం ఉద్యోగాల భర్తీలో విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, వయోపరిమితుల సడలింపు, రిజర్వేషన్లు తదితర మిగిలిన వివరాలకు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను పరిశీలించాలని స్పష్టం చేసింది.