రాష్ట్రీయం

ఉపాధి కూలీ చెల్లింపులో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఉపాధి కూలీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులును కోరారు. గురువారం ఉపాధి కూలీ చెల్లింపుల జాప్యంపై బ్యాకింగ్, పోస్టల్, గ్రామీణాభాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిరుపేద కూలీల కోసం చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో చెల్లింపుల్లో జాప్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్‌లో చెల్లింపులు ఆలస్యం అవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. నగదు కొరత కారణంగా పోస్టల్ చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి వివరించారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా అడగం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురౌతున్నయన్నారు. మూడు నెలలు పాటు ఆపరేట్ చేయకుండా ఉన్న అకౌంట్‌లను తొలగించడం, జీరో బ్యాలెన్స్ అకౌట్‌లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది
నిరాకరించడం లాంటి కారణాలతో చెల్లిపులను పోస్ట్ఫాసుల్లో చేయాల్సి వస్తుందని తెలిపారు. కూలీ చెల్లింపుల కోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు దాదాపు 360 కోట్లను, పోస్ట్ఫాసులకు 412 కోట్లను విడుదల చేశామని తెలిపారు. కేవలం పోస్టల్ ద్వారా జరిగే చెల్లింపులే ఆలస్యం అవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించగా ఆ శాఖ అధికారి పీవీఎస్ రెడ్డిని వివరణ కోరగా ఉద్యోగులు వారం రోజులుగా సమ్మెలో ఉన్న కారణంగానే ఇబ్బందులు తలెత్తాయని వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రికి వివరించారు. కేవలం ఉపాధి చెల్లింపుల కోసమే బుధవారం రూ.150 కోట్లు విడుదల చేశామని, మరో వారం రోజుల్లో రూ.150 కోట్లు విడుదల చేస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్ నాగేశ్వరరావు తెలిపారు. దినసరి జీవితాలు వెల్లదీస్తున్న కూలీను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు స్వమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు.