రాష్ట్రీయం

టీచర్ల బదిలీలకు ‘పంచాయతీ’ బ్రేక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలతో పాటు ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా టీచర్ల బదిలీలకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే ముసాయిదా షెడ్యూలును రూపొందించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే పక్షంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో మే 25 నుండి బదిలీలకు వీలుకలిగింది. జూన్ 15 వరకూ బదిలీ నిషేధంపై సడలింపు ఉంటుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం 31వ తేదీలోగా మార్గదర్శకాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. జూన్ 1 నుండి దరఖాస్తుల స్వీకరణ, జూన్ 6 నుండి దరఖాస్తుల పరిశీలన జరగాలి, 13వ తేదీ
నుండి బదిలీ ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఉద్యోగులకు జారీ చేసే మార్గదర్శకాలకు అనుబంధంగా ఉపాధ్యాయులకు ప్రత్యేకించి మార్గదర్శకాలను ఇస్తుంటారు. ఇంత వరకూ టీచర్ల బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలే జారీ కాలేదు, బదిలీల జీవోలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అంశాలను ప్రస్తావించినా, అందుకు సంబంధించి మరింత సవివర మార్గదర్శకాలతో పాటు ఖాళీలను కూడా పాఠశాల విద్యాశాఖ నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంత వరకూ ఈ ప్రక్రియకు సంబంధించి రెండు మార్లు జిల్లాల స్థాయిలో సమావేశాలు జరిగినా, ఇంకా అనేక అభ్యంతరాలు టీచర్ల నుండి వ్యక్తమవుతున్నాయి. ఖాళీలను, టీచర్ల సీనియార్టీ లిస్టులను ప్రకటించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, దానికి అనుగుణంగా జాబితాలను సవరించిన తర్వాత బదిలీల దరఖాస్తులను స్వీకరించి, వాటిని కూడా వెయిటేజీకి అనుగుణంగా జాబితాలను రూపొందించి బహిర్గతపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే కౌనె్సలింగ్ ద్వారా సీనియార్టీ ప్రాతిపదికన ఆయా టీచర్ల ఆప్షన్ల మేరకు బదిలీలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ముగియక ముందే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది. ఒక వేళ నోటిఫికేషన్ వెలువడినా, బదిలీలకు బ్రేక్ పడకుండా ఎన్నికల కమిషన్ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం పొందాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా పనిచేయాల్సిన టీచర్ల బదిలీలకు అనుమతి లభిస్తుందా అనేది కూడా అనుమానమే, మరో పక్క అక్రమ బదిలీల జీవోలపై కొంత మంది టీచర్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు.