రాష్ట్రీయం

30లోగా అమరావతికి ఫైళ్లు, ఫర్నిచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్న ఉపయోగపడే ఫైళ్లు, ఫర్నిచర్‌ను అమరావతికి తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్) కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి పేరుతో జీఓ జారీ అయింది. ఈ జీఓ ప్రకారం అన్ని శాఖలు కూడా ముఖ్యమైన సిబ్బందిని హైదరాబాద్ పంపించి, సచివాలయంలోని వారి వారి బ్లాకుల్లో ఉన్న ఉపయోగపడే ఫైళ్లను, ఫర్నిచర్ జాబితాను సిద్ధం చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌కు అందచేయాలని కోరారు. ఉపయోగపడే వాటిని అమరావతిలోని సచివాలయానికి తరలిస్తామని తెలిపారు. నిరుపయోగమైన కాగితాలను ఇతర సామాగ్రిని జూన్ 30 తర్వాత డిస్పోజ్ చేస్తామని ఈ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది.