రాష్ట్రీయం

తూ.గో.లో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 31: తూర్పు గోదావరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటు ఘటనలు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఒక రైతు మృతిచెందగా, కేబుల్ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాలిలావున్నాయి... జిల్లాలో గురువారం మధ్యాహ్నం వరకు భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. కాగా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా జిల్లాలోని కరప మండలం వాకాడ గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు దూడల సత్యనారాయణ (55) అనే రైతు మృతిచెందాడు. పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లినపుడు పిడుగుపాటు సంభవించడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
కాకినాడ నగరంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. అదే సమయంలో నరసన్ననగర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకుతూ వెళ్లిన కేబుల్ వైర్ల నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వెలువడ్డాయి. దీనితో చాగంటి వీర్రాజు(62) అనే వృద్ధుడి ఇంట్లో టీవికి అమర్చిన కేబుల్ వైర్లను తొలగించడానికి ప్రయత్నించి, విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన వీర్రాజును రక్షించే ప్రయత్నంచేసిన అతని వదిన సుబ్బలక్ష్మి (64) కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ప.గో.లో ఐదు పశువులు మృతి
కాగా పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మల్లారం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఐదు పశువులు మృతిచెందాయి. అదే గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులకు చెందిన మూడు బండి ఎద్దులు, రెండు ఆవులు ఈ దుర్ఘటనలో మృతిచెందాయి. పిడుగుల కారణంగా మండలంలో పలు చెట్లు దగ్ధమయ్యాయి.

చిత్రాలు..కాకినాడలో విద్యుదాఘాతంతో మృతి చెందిన వీర్రాజు, సుబ్బలక్ష్మి.
* ప.గో. జిల్లా మల్లారంలో పిడుగుపాటుకు మృతి చెందిన పశువులు