రాష్ట్రీయం

నేరస్తుల కుటుంబాల దత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: పాత నేరస్తుల కుటుంబాల్లోని పిల్లలకు విద్య నేర్పించడం ద్వారా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని పోలీసుశాఖ తీసుకుంది. ఎప్పుడో తెలిసోతెలియక చేసిన పలు నేరాల్లో నేరస్తులుగా మిగిలిపోయిన వారి కుటుంబాల్లోని పిల్లలు వీధినపడి చదువు లేకుండా, అనారోగ్యంతో బాధలు పడుతున్న వారిని ఆదుకునేందుకు బస్తీలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని తాము చేపట్టామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. తొలిసారిగా తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరాఠా బస్తీగా పిలిచే మంగర్‌బస్తీలో పాత నేరస్తుల కుటుంబాలను కలిసి వారి పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యతను నగర ఉత్తర మండల డీసీపీ సుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క రూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కా రం దొరుకుతుందన్నారు. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకెళ్లిన వారి పిల్లలు కూడా దొంగలుగా, అసాంఘిక శక్తులుగా మారకుండా వారిలో చైతన్యం తీసుకురావడం కోసం చేసేదే ఈ ప్రయత్నమని అన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 25 మంది పిల్లలను గుర్తించామని, వారికి చదువు చెప్పించడంతో పాటు భవిష్యత్‌లో వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా తాము సహా య పడగలమని చెప్పారు. ఉత్తర మండల డీసీపీ సుమతి మాట్లాడుతూ పిల్లలను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్చి దిద్దడంలో ఎక్కువ తల్లిదండ్రులపై బాధ్యత ఉందని చెప్పారు. విద్యకు అవసరమైన సహాయం చేయడంతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే తాము సహకరించి ఆరోగ్య శిబిరాల ద్వారా నయం చేస్తామని అన్నారు. ఇంకా పెద్ద రోగాలైతే పెద్ద ప్రభుత్వాసుపత్రికి తామే తీసుకెళ్లి వైద్యం చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.