రాష్ట్రీయం

వైభవంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేడుకల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను మంత్రి వెల్లడించారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, చారిత్రక, వారసత్వ కట్టడాలకు త్రిడి మ్యాపింగ్‌లతో పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 200 మంది ప్రముఖ చిత్రకారులు చిత్రించిన చిత్రాలు ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. జూన్ 2న సాంస్కృతిక శాఖ ద్వారా 1000 మంది కళాకారులతో లుంబినీ పార్కు నుండి పీపు ల్స్ ప్లాజా వరకు తెలంగాణ సాంస్కృతిక కళాజాతరను నిర్వహిస్తున్నామని వివరించారు. ఉత్సవాల సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో బైసన్ పోలో మైదానంలో పారామోటరింగ్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందు కు సంబంధించిన బ్రోచర్‌ను పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంతో కలిసి ఆవిష్కరించారు. జూన్ 3వ తేదీ నుంచి 5 వరకు ఉదయం, సాయం త్రం వేళల్లో జాయ్ రైడ్‌ను నిర్వహిస్తామని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చేందుకు జిల్లా, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానోత్సవం....
అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడు రాష్టస్థ్రాయిలో అందించే అవార్డుల కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. ముందుగా నిర్ణయించిన సమయంలో స్వల్ప మార్పులు చేసినందున అవార్డు గ్రహీతలు 6గంటలకు రవీంద్రభారతికి రావాలని కోరారు.