రాష్ట్రీయం

పేదకు ధీమా.. చంద్రన్న బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: ఆన్‌లైన్‌లో అన్ని పౌర సేవలు ప్రజల ఇంటి వద్దకే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పటికే పలు సంస్థలు ఈ తరహా వ్యవస్థకు శ్రీకారం చుట్టాయని, తామూ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి హఠాత్తుగా చనిపోతే చంద్రన్న బీమా ఎంతో ఆసరాగా ఉంటోందన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో పీఎంజేజేబీవై-చంద్రన్న బీమా మూడవ సంవత్సర ప్రీమియం చెల్లింపు కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో పౌర సేవలను బేరీజు వేస్తే ఏపీయే నెంబర్-1గా ఉంటుందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా ఇంట్లో నుంచే హలో చంద్రన్నా అంటే ఇంట్లో టీవీ ముందు కూర్చుని సమస్య చెబితే, ఆ సమస్య పరిష్కరించి, తిరిగి సమాచారాన్ని ఇచ్చే పరికరాల వ్యవస్థ త్వరలో అందుబాటులో రానుందన్నారు. ఇప్పటికే గెలాక్సీ ద్వారా సంగీతం, హలో గూగుల్ ద్వారా గదులు, విమాన టికెట్ల బుకింగ్ వంటివి చేయడాన్ని గుర్తు చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఏపీలో ప్రజలకు సౌకర్యాలు కల్పించటంలో ముందున్నామన్నారు. ప్రజల్లో చంద్రన్న బీమా పట్ల వంద శాతం సంతృప్తి ఉండేలా కృషిచేస్తే ప్రజల్లో నమ్మకంతోపాటు పేరు, పుణ్యం వస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో బీమా మిత్రలు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఈ పథకంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి 98శాతంగా ఉందన్నారు. 2012లో పాదయాత్ర సమయంలో ప్రమాదానికి గురై అనేక కుటుంబాలు రోడ్డున పడుతుండటాన్ని గమనించి డ్రైవర్లకు బీమా సౌకర్యాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. ఆ తరువాత దీన్ని కేంద్ర సహకారంతో పేదలందరికీ వర్తింపు చేసే నిర్ణయం తీసుకున్నామన్నారు. పేద కుటుంబాల్లో మరణం సంభవిస్తే పదకొండు రోజుల్లో బీమా మొత్తం అందేలా సర్వీస్ నిబంధనలు రూపొందించామన్నారు. ఇంటిలో డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రన్న బీమా పథకం అమలు తీరు తనకు సంతృప్తి కలిగిస్తోందన్నారు. గత ఏడాది 1200 కోట్ల రూపాయల మేర లబ్ధిదారులకు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం
సరైన పద్ధతిలో వెళ్లకపోవటం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం పెరిగిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ మాటలు కోటలు దాటుతుంటాయని, కాని చేష్టలు గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మాటలను తానూ నమ్మి మోసపోయానని ఆరోపించారు. ప్రధాని వల్ల ఎవరికైనా ఒక పైసా లాభం కలిగిందా? అని ప్రశ్నించారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులకు కూడా బ్యాంక్‌ల క్యూలో నించోవాల్సి వస్తోందని విమర్శించారు.కరెన్సీ కొరత ఇంకా వెంటాడుతోందని, నెలవారీ పింఛన్లు ఇవ్వాలంటే కరెన్సీ కోసం బ్యాంకలకు సీఎం ఫొన్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. పెట్రోల్ ధర పైసా తగ్గించడం పెద్ద జోక్‌గా ఎద్దేవా చేశారు. పేదవారి జీవీతాలతో ఆడుకుంటారా? అని ప్రశ్నించారు. అనుభవం లేని వారు పరిపాలన చేస్తామంటున్నారని, , కొత్తవారు కుట్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కొందరు ప్రతి శుక్రవారం బోనెక్కి, బయటకు వస్తూనే తనను విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు దుర్మార్గంగా మారాయని, కర్నాటకలో కొంతమంది ఎమ్మెల్యేలకు జీవితంలో ఎంత సంపాయించావో, అంతకు 100 రెట్లు సంపాయించేలా అవకాశాలు ఇస్తామంటూ బేరసారాలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కుటుంబ యజమాని చనిపోతే అండగా ఉండేందుకు ఈ పథకం ఆసరాగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులకు బీమా ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. చంద్రన్న బీమా లబ్ధిదారులు గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన యశోద, కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన లక్ష్మీనాగేశ్వరమ్మ మాట్లాడుతూ బీమా ద్వారా ఆర్థిక సాయం అందించటం మరువలేనిదన్నారు. ఈ పథకానికి సంబంధించి మూడవ విడత ప్రీమియం రూ.366.23కోట్ల చెక్కును ఎల్‌ఐసీ రీజనల్ మేనేజర్ ఎం.జగన్నాధ్‌కు సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాస్, కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ రామ్మోహనరావు, ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, కమిషనర్ వరప్రసాద్, బీమా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బీమా ప్రీమియం చెల్లింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు