రాష్ట్రీయం

ఇది టీడీపీ అభివృద్ధే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం: పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద వేలకోట్లు ఉంటాయి, కానీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఉండవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం విజయనగరం జిల్లా గజపతినగరంలోని మెంటాడ రోడ్డు జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ విరుచుకుపడ్డారు. ఆండ్ర రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టి పూడిక తీస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అంది రైతు మూడుపూటలా తింటాడన్నారు. అటువంటి ప్రాజెక్టుని పూర్తిగా వదిలేశారన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామంటున్న ముఖ్యమంత్రి ఒక్కసారి చంపావతి నదిని చూడాలన్నారు. నాలుగేళ్ళ కిందటి వరకు నదిలో నీటిని ప్రజలు తాగేవారని, ఇపుడు ఒక మురికి కూపంలా నది తయారైందని, నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఇసుక మాఫీయాలో తెలుగు తమ్ముళ్లు కూరుకుపోయారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఎదిరించి ప్రశ్నించే అధికారులపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది టీడీపీ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో అన్ని అర్హతలు ఉన్నా మరణించిన వారికి చంద్ర న్న బీమా మొత్తాలు అందడంలేదని అన్నారు. ఎంపీగా ఉన్న అశోక్ గజపతిరాజు గజపతినగరం రైల్వే స్టేషన్‌లో ఒక్క ఎక్స్‌ప్రెస్ రైలు అయినా నిలిచే విధంగా చర్యలు తీసుకున్నారా అనిప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన రామ్‌విలాస్ పాస్వాన్ తన నియోజకవర్గం మీదుగా ప్రయాణించే అన్ని రైళ్ళను నిలుపుతున్నారని, ఇక్కడ అశోక్‌కు మాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్రంలో 15వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని
చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు ఒక్కసారి గజపతినగరంలోని రోడ్లు పరిస్థితిని గమనించి మాట్లాడాలని అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం గతుకులతో నిండి పందులు స్వైర విహారం చేస్తున్నాయని, ఇలాగైతే రోగాలు రావా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి బానిసగిరి, గులామ్‌గిరి చేస్తే మంచోడని, ప్రశ్నిస్తే బీజేపీ స్క్రిప్ట్ మాట్లాడుతున్నానని టీడీపీ నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో అనినీతికి సాక్ష్యాలు కావాలని అంటున్నారని, లంచాలు ఇస్తే రశీదులు ఎవరైనా ఇస్తారా అని ప్రశ్నించారు.
సందిట్లో సడేమియా అన్నట్లుగా జేబుదొంగలు పవన్ బహిరంగ సభ జరుగుతున్న సమయంలో రెచ్చిపోయారు. యువత పెద్ద సంఖ్యలో రావడం, కిక్కిరిసి పోవడంతో జేబుదొంగలు తమ పనికానిచ్చేశారు. ఎస్.లింగాలవలస గ్రామానికి చెందిన ఆల్తి శ్రీనివాసరావు జేబులో నుండి 15 వేలు అపహరణకు గురికాగా, పెదకాద గ్రామానికి చెందిన పారాది గణేష్ నుండి 30వేల రూపాయల పర్సును అపహరించారు. నియోజకవర్గం పరిధిలోని అయిదు మండలాల నుంచీ పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా పవన్ సభకు తరలి వచ్చారు.

చిత్రం..గజపతినగరం సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్