రాష్ట్రీయం

పగ్గాలిస్తే జాబుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతోనే జతకడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత జగన్మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముందుగా ఎవరితో నూ పొత్తులుండవని, ఆ తర్వాతే హోదా ఇచ్చే పార్టీకి పూర్తిమద్దతు తెలుపుతానని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్ శుక్రవారం పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను నమ్మవద్దంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా న్ని అడ్డగోలుగా విభజిస్తే, హోదా ఇచ్చే అవకాశమున్నా బీజేపీ ముందుకు రాలేదన్నారు. అందువల్ల ఆ రెండు పార్టీలను అస్సలు నమ్మవద్దన్నా రు. అలాగే ప్రత్యేక హోదా పేరుతో నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును కూడా నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే హోదా సాధించి చూపుతామని
స్పష్టంచేశారు. కాగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుచేస్తామని ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారని, తాము అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి ఏటే ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు జారీచేస్తామన్నారు.
ప్రతి గ్రామంలో పది మందితో గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేస్తామని, ఆ విధంగా 1.60 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ సచివాలయాల్లోనే ఎవరు ఏ పనికి అర్జీ చేసుకున్నా 72 గంటల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు కాపుల విజ్ఞప్తిపై స్పందించిన జగన్ తాము అధికారంలోకి వస్తే తూర్పుకాపులకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు అధికారం చేపట్టాక డెల్టా ప్రాంతంలో కరువు తాండవిస్తోందని, రెండవ పంటకు నీరందక పోవడంతో వంతుల వారీగా నీరిస్తున్నారని పేర్కొన్నారు. డెల్టా ఆధునీకరణ పనులు పూర్తిగా అటకెక్కాయని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తూ ఆయన ఒక కధ చెప్పడంతో సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నిరుద్యోగ భృతిపై ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు ముష్టిగా వెయ్యి రూపాయలు చెల్లిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు స్థాపించడానికి ఔత్సాహికులు ముందుకు వస్తారని చెప్పారు. నూతనంగా స్థాపించిన పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా శాసనసభ తొలి సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం చేస్తామన్నారు.
కాగా వై ఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం 177వ రోజుకు చేరుకుంది. నర్సాపురం శివారు నుంచి ప్రారంభమై చిట్టిమర్రు క్రాస్, రాజోలు క్రాస్, దిగమర్రు, పెద్దగరువు క్రాస్, పాలకొల్లు మీదుగా ఉల్లంపర్రు వరకు కొనసాగింది. ప్రతీ చోటా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పాలకొల్లు బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్