రాష్ట్రీయం

మా ఆట మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 1: రాష్ట్రంలో కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ మొదలైందని, రానున్న 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు, సంఘాలతో కాంగ్రెస్ జత కడుతుందన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాయన్నారు. కర్టాటక నుంచే బీజేపీ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. రాష్ట్ర ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజు నుంచే కాంగ్రెస్ ఉద్యమం చేపట్టి ఇప్పటికీ కొనసాగిస్తోందని, నాలుగేళ్ల పాటు బీజేపీతో జతకట్టి పాలించిన టీడీపీ ప్రజాభిప్రాయాలకు తలొగ్గి ఇప్పుడు హోదా కోసం చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ లేదని, ప్రజలు ఇది గమనిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ 2014 రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఆదరించకపోయినా, అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా,
తాము ప్రకటించిన, ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచే ఉద్యమించామన్నారు. అన్ని రంగాల్లో ఏపీని అగ్రగామిగా ఉంచుతానని చెప్పి ఒక్క అవినీతిలోనే అగ్రగామిగా నిలపడం టీడీపీ వైఫల్యపాలనకు నిదర్శనమన్నారు. టీటీడీ బోర్డులో మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యకు స్థానం కల్పించారని, కేంద్ర మంత్రి భర్తకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వటం చూస్తుంటే బీజేపీ, టీడీపీల మధ్య బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నది స్పష్టమవుతోందన్నారు. ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందని, హోదా, ప్యాకేజీ లోనే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం, లోటు బడ్జెట్ భర్తీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ తదితర అంశాల విషయంలో రాష్ట్ర ప్రజలకు కేంద్రం నమ్మక ద్రోహం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమన్నారు. నోట్ల రద్దు అంశాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రఘువీరారెడ్డి అర్ధరాత్రి అమలులోకి తీసుకుచ్చిన జీఎస్టీకి తల, తోక రెండూ లేవన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ బీజేపీకి తోక పార్టీలేనని, ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు వంటింట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా వైకాపా అన్నివిధాలా వైఫల్యం చెందిందన్నారు. అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడాల్సిన వారు రోడ్లపై తిరుగుతున్నారని, 2019 ఎన్నికలపైనే వారందరి దృష్టి ఉందే తప్ప ప్రజా సంక్షేమం పై లేదని విమర్శించారు. టీడీపీ నిర్వహించిన మహానాడు కేవలం మహా భోజన నాడుగానే నిర్వహించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఓటమి ఎరుగని కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీని ఇన్‌చార్జ్‌గా నియమించడం హర్షనీయమన్నారు. తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందని, బెంగళూరులో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు కలవడంలో రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదన్నారు. అయినా రానున్న 2019 ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటితో కలిసి పనిచేస్తుందని, థర్డ్ ఫ్రంట్ అనేది ఒక అభూత కల్పనే కానీ, దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదని ఉద్ఘాటించారు.