రాష్ట్రీయం

నలుదిక్కుల వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: దేశంలో 29వ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేటితో ఐదో వసంతంలోకి అడుగిడింది. ఎల్‌కెజీ, యుకేజీల దశలను దాటి మొదటి తరగతిలో చేరేంత వయసున్న పసిబిడ్డ తెలంగాణ. అయినప్పటికీ ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ అగ్రగ్రామిగా ఎదిగిందనడంలో అతిశయోక్తి లేదు. ‘తెలంగాణకున్న వనరులు, అవకాశాలు భవిష్యత్‌లో దేశంలోనే నంబర్ వన్‌గా ఎదుగబోతుంది’ అని తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడు వేదికపై చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగా కల సాకారమైంది. రాష్ట్ర సాధనకు సారథ్యం వహించిన ఉద్యమ నాయకుడు కేసీఆరే, తెలంగాణ కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. చిన్న రాష్ట్రం తెలంగాణ మనుగడ ఎలా సాగించగలదన్న పలు సందేహాలను అధిగమిస్తూ దేశంలోనే నంబర్ వన్‌గా నిలపడానికి సిఎం కేసీఆర్ చేస్తోన్న కృషి ప్రస్తుతం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి సాధించగలిగింది. రాష్ట్ర జీడీపీ జాతీయస్థాయి కంటే అధికంగా నమోదైంది. జాతీయ వృద్ధిరేటుకంటే తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు ప్రస్తుతం 1.6 శాతం ఎక్కువ. గత ఏడాది రాష్ట్ర స్థూల ఆదాయం 4.68 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది అది 5.83 లక్షల కోట్లుగా నమోదైంది. తలసరి ఆదాయం లక్షా 43 వేలుగా నమోదైందంటే ఇది జాతీయ తలసరి ఆదాయానికంటే 66 వేలు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో 2011-12లో ఒక వ్యక్తి తలసరి వార్షికాదాయం రూ.91.121 ఉండగా 2016-17లో ఇది 73 శాతం పెరిగి రూ.లక్ష 58వేల 360కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం మిగులు బడ్జెట్ కలిగిన రెండు మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు మైనస్ 8 శాతం కాగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6 శాతం. పారిశ్రామిక రంగంలో తెలంగాణ 13 శాతం వృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధి రేటు 4 శాతం మాత్రమే కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 2017-18లో 6.9 శాతం. పారిశ్రామిక, వ్యవసాయరంగాల్లోనే కాకుండా సాగునీటి రంగంలో కూడా అద్వితీయమైన పురోగతి సాధించింది. రూ.83 వేల కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కోటి ఎకరాలకు సాగునీటిని కల్పించే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోంది. అభివృద్ధి పథకాలలోనే కాకుండా
సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఏటా సంక్షేమ రంగంపై 35 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. కేవలం 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ 31 జిల్లాలతో పునర్ వ్యవస్థీకరణ జరిగింది. ఎప్పుడో నిజాం కాలం నాటి భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయని పంట పెట్టుబడి పథకం కార్యరూపం దాల్చింది. ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ. 8 వేల ఉచిత పెట్టుబడిని ప్రభుత్వమే అందిస్తోంది. అలాగే ప్రతీ రైతకు జీవిత బీమా కల్పించే పథకం పురుడు పోసుకుంటోంది. ఆగస్టు 15న ప్రారంభం కాబోతున్న ఈ వినూత్న పథకం కూడా మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. వ్యవసాయ, నీటిపారుదల, పారిశ్రామిక,సంక్షేమ, ఆర్థిక రంగాలలో అన్నింట్లోనూ తెలంగాణ శరవేగంగా ముందుకు సాగిపోతూ నేడు నాలుగవ వసంతంలోకి అడుగీడింది.

చిత్రం..రాష్ట్రావతరణ దినోత్సవానికి ముస్తాబైన తెలంగాణ