రాష్ట్రీయం

ఐటీలో మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదుగుతోందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీలో మేటి రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణకు కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సహం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించినప్పటికీ గత నాలుగేళ్లుగా ఉలుకు పలుకూ లేదన్నారు. శుక్రవారం ఐటీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో ఐటీని చిన్న చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర తూర్పు ప్రాంతంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. లుక్ ఈస్ట్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. టీ-వ్యాలెట్‌ను 3.4 లక్షల మంది వినియోగిస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి ప్రభుత్వ వెబ్ సైట్లు, సేవల వివరాలతో కూడిన టీ-వెబ్‌ను ఆవిష్కరించారు. అలాగే రైతులు విత్తనాలు, ఎరువులను ఇక నుంచి మీ- సేవా ద్వారా పొందవచ్చన్నారు. ఈ మేరకు ఇఫ్కో- తెలంగాణ ఐటీశాఖ ఒప్పందం కుదర్చుకుంది. టీ-వెబ్‌తో పాటు టీ-శ్వాన్ రెండో దశను మంత్రి ప్రారంభించారు. దీనివల్ల జిల్లా, మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు అనుసంధానం ఏర్పడుతుంది. రెవిన్యూ శాఖ ధరణి వెబ్‌సైట్ నిర్వహణలో టీ-శ్వాన్ రెండో దశ కీలకపాత్ర పోషించనుందని మంత్రి అన్నారు.