రాష్ట్రీయం

మధ్యంతర భృతి ప్రకటన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన ప్రకటిస్తామన్న మధ్యంతర భృతి ప్రకటనను వాయిదా వేస్తున్నట్టు సీఎం కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం మధ్యహ్నాం ప్రగతి భవన్‌లో మధ్యంతర భృతికి సంబంధించి వేతన సవరణ సంఘం చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యుడు మహ్మద్ అలీ రఫత్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొద్దిరోజుల క్రితమే నియమితమైన వేతన సవరణ సంఘం నివేదిక రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని, ఈలోగా మధ్యంతర భృతి ప్రకటిస్తే వేతన సంఘాన్ని అగౌరవ పరిచినట్టు అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పీఆర్‌సీ నివేదిక అందే వరకైనా వేచి చూడాలన్న అధికారుల సూచనతో ఏకీభవించిన సీఎం, మధ్యంతర భృతి ప్రకటనను వాయిదా వేసినట్టు వెల్లడించారు.